పాకిస్థాన్‌లోని క్వెట్టా రైల్వే స్టేషన్ శనివారం భయంకరమైన బాంబు పేలుడుతో కంపించింది. పెషావర్‌కు వెళ్ళే రైలు ప్లాట్‌ఫాం వద్ద సిద్ధంగా ఉండగా ఈ పేలుడు చోటుచేసుకుంది. ఈ దారుణ ఘటనలో 20 మంది ప్రాణాలు కోల్పోయారు, మరో 30 మంది తీవ్రంగా గాయపడ్డారు. ఈ పేలుడు కారణంగా మృతదేహాలు ఎగిరిపడ్డాయి. ఈ ఘటన ఆత్మాహుతి దాడిలా అనిపిస్తోందని, కానీ పూర్తి నిర్ధారణ కోసం దర్యాప్తు కొనసాగుతోందని క్వెట్టా సీనియర్ ఎస్పీ తెలిపారు.
పేలుడు జరిగిన సమయంలో ప్లాట్‌ఫాంపై సుమారు 100 మంది ప్రయాణికులు ఉన్నారని ఎస్సెస్పీ వెల్లడించారు. రైలు రావల్పిండి బయలుదేరే క్రమంలోనే ఈ దుర్ఘటన జరిగింది. ఘటన జరిగిన వెంటనే గాయపడిన వారిని సమీపంలోని ఆసుపత్రులకు తరలించారు, వారిలో కొందరి పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు వెల్లడించారు.
పాకిస్థాన్‌లోని బలూచిస్థాన్ ప్రావిన్స్ తరచూ వేర్పాటువాద దాడులకు వేదిక అవుతోంది. బలూచ్ లిబరేషన్ ఆర్మీ (బీఎల్ఏ) అనే ఉగ్రవాద సంస్థ అక్కడి పాక్ ఆర్మీ మరియు ఇతర ప్రావిన్సుల ప్రజలపై తరచూ దాడులు చేస్తోంది. ఈ ఏడాది ఆగస్టులో కూడా వారు 39 మందిని హతమార్చారు.