రక్తదానం చేసి మరో ముగ్గురి ప్రాణాలు కాపాడగలమని వరంగల్ పోలీస్ కమిషనర్ తెలిపారు. పోలీస్ అమరవీరుల సంస్మరణ దినోత్సవాలను పురస్కరించుకోని వరంగల్ కమిషనరేట్ కార్యాలయములో రక్తదాన శిబిరాన్ని వరంగల్ పోలీస్ కమిషనర్ శనివారం ప్రారంభించారు. ఆర్మూద్ రిజర్వ్ మరియు ట్రాఫిక్ పోలీసుల అధ్వర్యంలో యం.జి.యం రక్తనిధి సహకారంతో ఏర్పాటు చేసిన ఈ రక్తదాన శిబిరానికి ఆర్మూడ్ రిజర్వ్, ట్రాఫిక్ విభాగాలకు చెందిన పోలీస్ అధికారులు, సిబ్బందితో పాటు స్థానిక యువత, ఆటో డ్రైవర్లు స్వచ్చందంగా రక్తదానం చేసారు. ఈ సందర్భంగా స్వచ్ఛందంగా రక్తదానం చేసిన పోలీస్ అధికారులు, సిబ్బందిని పోలీస్ కమిషనర్ వ్యక్తిగతంగా కలుసుకోని అభినందించడంతో పాటు వారికి పండ్లు, సర్టిఫికేట్లను అందజేసారు. అనంతరం పోలీస్ కమిషనర్ మాట్లాడుతూ పోలీసులు కేవలం శాంతి భద్రతలను పరిరక్షించడమే కాదు సేవా కార్యక్రమాల్లోను ముందు వరసలో వుంటారని, ముఖ్యంగా రక్తదానంపై వున్న ఆపోహలను నమ్మకుండా ప్రతి ఒక్కరు రక్తదానం చేసేందుకు ముందుకు రావాలని, పోలీస్ సిబ్బంది తమ వ్యక్తిగత ఆరోగ్యం పట్ల దృష్టి పెట్టాలని సూచించారు. ఈ కార్యక్రమంలో డిసిపి రవీందర్ , అదనపు డిసిపిలు సురేష్ కుమార్, ఏసీపీలు అనంతయ్య, సురేంద్ర, సత్యనారాయణ, ఆర్.ఐలు శ్రీధర్, చంద్రశేకర్, శ్రీనివాస్,స్పర్జన్, రాజ్ ఇన్స్ స్పెక్టర్లు సీతారెడ్డి, రామకృష్ణ , యం.జి.యం రక్తనిధి డాక్టర్ ఆశతో పాటు పోలీస్ యూనిట్ వైద్యులు, ఇతర పోలీస్, పరిపాలన మరియు యం.జి.యం సిబ్బంది పాల్గోన్నారు.
వరంగల్ పోలీసుల రక్తదాన శిబిరం
Warangal Police Commissioner emphasizes the lifesaving potential of blood donation, encouraging community participation and recognizing volunteers during a special event.
