బీజేపీ పుట్టపర్తి టౌన్ నూతన కమిటీ ఎన్నికల సమావేశం జిల్లా బీజేపీ కార్యాలయంలో టౌన్ అధ్యక్షుడు కళ్యాణ్ కుమార్ అధ్యక్షతన జరిగింది. ఈ సందర్భంగా బీజేపీ నాయకులు పార్టీ ఆవిర్భావం, సిద్ధాంతాలు, దేశవ్యాప్తంగా జరుగుతున్న అభివృద్ధి కార్యక్రమాల గురించి వివరించారు. సమావేశంలో జిల్లా, రాష్ట్ర స్థాయి నాయకులు పాల్గొని కార్యకర్తలను ఉద్దేశించి మాట్లాడారు.
ఈ సమావేశంలో పట్టణ ప్రధాన కార్యదర్శులుగా నారాయణ, లక్ష్మీనారాయణ నాయక్, ఉపాధ్యక్షులుగా కుమార్, శివశంకర్ రెడ్డి, కుసుమా జయరాం, నాగేష్, సత్యమయ్య, ట్రెజరీ బాధ్యతలను నాగభూషణ ఆచారి నిర్వహించనున్నారు. పట్టణ కార్యదర్శులుగా మధుసూదన్, భరత్, వెంకట రమణమ్మ, మధుమోహన్, నంజప్ప, రాజేష్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.
ఈ కార్యక్రమంలో రాష్ట్ర కల్లుగీత ఫెడరేషన్ కన్వీనర్ హరికృష్ణ గౌడ్, జిల్లా ఉపాధ్యక్షుడు కొండమరాజు, జిల్లా ప్రధాన కార్యదర్శి కత్తి రాజారెడ్డి, జిల్లా మీడియా కన్వీనర్ జ్యోతి ప్రసాద్, జిల్లా ధార్మిక సెల్ కన్వీనర్ బాలగంగాధర్, జిల్లా కోశాధికారి సురేంద్రబాబు పాల్గొన్నారు. నాయకులు పార్టీ విధానాలను ప్రజలకు చేరువ చేసేందుకు కృషి చేయాలని పేర్కొన్నారు.
సీనియర్ నాయకులు ధనుంజయ రెడ్డి, సోకే రామాంజనేయులు, ఇతర బీజేపీ కార్యకర్తలు సమావేశానికి హాజరై తమ అభిప్రాయాలు వ్యక్తం చేశారు. కొత్తగా ఎన్నికైన కమిటీ సభ్యులకు నాయకులు అభినందనలు తెలిపారు. పార్టీని బలోపేతం చేసేందుకు సమష్టిగా కృషి చేయాలని నాయకులు సూచించారు.

 
				 
				
			 
				
			 
				
			