- ఎకొ వైజాగ్ లో ఆకుకూరలు విత్తనాలు పంపిణీ
- మిద్దె తోటల మీద నగరవాసులు అందరికీ అవగాహన అవసరం
- వనమాలి, సిటిజి గార్డెనింగ్ సంస్థలు
ప్రతీ ఇంటి మీద మిద్దె తోటలు పెంచాలి అని వనమాలి, సిటిజి సంస్థలు నగరంలో శని, ఆదివారాల్లో 13 ప్రదేశాలలో అవగాహన కార్యక్రమాలు నిర్వహించడం జరిగింది. “ఇచ్చి పుచ్చుకునే” విధానం లో కూరగాయల మొక్కలు, అంట్లు, విత్తనాలు పంపిణీ చేశారు. ఎకొ వైజాగ్ లో భాగంగా గ్రీన్ క్లైమేట్ టీం ఎన్ జి ఒ వ్యవస్థాపక కార్యదర్శి జెవి రత్నం ఆకుకూరల విత్తనాలు పంపిణీ చేశారు. మిద్దె తోటల మీద నగరవాసులు అందరికీ అవగాహన అవసరం అని తాము నగరం లో ప్రతి నెలా అవగాహన కార్యక్రమాలు నగరం అంతటా నిర్వహిస్తున్నాం అని సంస్థల ప్రతినిధులు అరవల అరుణ, మళ్ళ సరిత, నాదెళ్ల జ్యోతి పేర్కొన్నారు. రసాయన ఎరువులు, రసాయన క్రిమి సంహారకాలు, రసాయన కలుపుతీత ముందులతో పండిస్తున్న ఆకుకూరలు, కూరగాయలు, పండ్లు వల్ల కలిగే నష్టాలు వివరిస్తున్నామన్నారు. ఎవరి ఇంటి వద్ద వారు కూరగాయలు, ఆకుకూరలు పండించడం వల్ల కలిగే ప్రయోజనాలు వివరించి ప్రతి ఒక్కరూ తమ ఇంటి వద్ద పెంచడానికి తాము కృషి చేస్తున్నామన్నారు.
ప్రధానంగా నగరం లో మురళీ నగర్, ఎండాడ, మద్దిలపాలెం, గోపాలపట్నం, పెందుర్తి, ఎన్ ఎడి కొత్త రోడ్డు, ఒన్ టౌన్, ద్వారకా నగర్, అక్కయ్య పాలెం, సీతమ్మ ధార, ఎంవిపి కాలనీ, కూర్మన్న పాలెం, గాజువాక ల్లో వనమాలి సిటిజి గార్డెనర్స్ గ్రూప్ లు అవగాహన కార్యక్రమాలు నిర్వహించడం జరిగిందన్నారు. తమను సంప్రదించవలసిన మొబైల్ నెంబర్లు 7794930439, 8121382753, 8500874103 గా పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో “ఎకో విజనరీ” పర్యావరణ సంస్థ ప్రతినిధులు జి దనూష, డి పూజిత, కె. మేఘన, కె ఎల్ దీపిక, కె కుసుమ అపర్ణ తదితరులు పాల్గొన్నారు.