- ఎకొ వైజాగ్ ను విజయవంతం చేద్దాం
- మిద్దె తోటల మీద విద్యార్థులకు అవగాహన అవసరం
- జెవి రత్నం, వ్యవస్థాపక కార్యదర్శి, గ్రీన్ క్లైమేట్ టీం NGO
మిద్దె తోటల నగరంగా విశాఖ ను తీర్చి దిద్దుదాం అని గ్రీన్ క్లైమేట్ టీం ఎన్ జి ఒ వ్యవస్థాపక కార్యదర్శి జెవి రత్నం కోరారు. బుధవారం మధ్యాహ్నం మద్దిలపాలెం లోని శ్రీ భావన విద్యానికేతన్ లో ఎకొ వైజాగ్ లో భాగంగా మిద్దె తోటల పెంపకం గురించి విద్యార్థులకు గ్రీన్ క్లైమేట్ టీం ఎన్ జి ఒ, ఎయు సోషల్ వర్క్ విద్యార్థులు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మిద్దె తోటల మీద విద్యార్థులకు అవగాహన అవసరం అన్నారు. ప్రకృతి ఆధారంగా ఇంటి పైకప్పు మీద వ్యవసాయం చేయండి, కూరగాయలు, ఆకుకూరలు పండించి ఆరోగ్యంగా జీవించండి అని కోరారు.
ఈ కార్యక్రమంలో గాంబియా దేశానికి చెందిన సోషల్ వర్క్ విద్యార్థిని ఆడమ్ బి సార్ మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ తమ ఇంటి వద్ద కూరగాయలు, ఆకుకూరలు, పండ్లు జాతి మొక్కలు పెంచడం గురించి వివరించారు. ప్రతీ విద్యార్థి తమ ఇంటి వద్ద ఆహారానికి అవసరమైన మొక్కలు పెంచడం మిగిలిన వారికి ఆదర్శంగా నిలవాలని కోరారు.
ఎయు మాస్టర్ ఆఫ్ సోషల్ వర్క్ విద్యార్థిని బి తేజస్విని మాట్లాడుతూ పురాతన పద్దతి లో విత్తనాలు, కూరగాయలు, పండ్లు జాతి మొక్కలు ఇచ్చి పుచ్చుకునే విధానం లో పెంచడం అవసరం అన్నారు. దేశీయ విత్తనాలు పరిరక్షణకు కృషి చెయ్యాలి అన్నారు.
ఎయు మాస్టర్ ఆఫ్ సోషల్ వర్క్ విద్యార్థిని మాట్లాడుతూ పర్యావరణ పరిరక్షణ కోసం ప్రతి ఒక్కరూ 10 మొక్కలు నాటి పెంచాలి అని కోరారు. ఎకో వైజాగ్ విజయవంతం చేయాలని కోరారు.
ఈ కార్యక్రమంలో శ్రీ భావన విద్యానికేతన్ సంస్థ ప్రతినిధి నీలిమ, ఎయు మాస్టర్ ఆఫ్ సోషల్ వర్క్ విద్యార్థిని బి చైతన్య సరస్వతి, గ్రీన్ వాలంటీర్ జె. రాజేశ్వరి తదితరులు పాల్గొని మాట్లాడారు.