నిజాంపేటలో విద్యార్థులకు మూఢనమ్మకాలపై అవగాహన

In Nizam Peta, local police and student federation members conducted an awareness program on superstitions In Nizam Peta, local police and student federation members conducted an awareness program on superstitions

నిజాంపేట మండల కేంద్రంలోని శ్రీ శంకర హైస్కూల్ లో స్థానిక ఎస్ఐ శ్రీనివాస్ రెడ్డి, సైటింఫిక్ స్టూడెంట్ పెడరేషన్ కమిటీ సభ్యుడు నరేష్ ఆధ్వర్యంలో మూఢనమ్మకాలపై విద్యార్థులకు అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు మూఢనమ్మకాలు బాణామతి మంత్రాల నేపథ్యంలో అమాయకులను మోసం చేస్తున్న తీరును ప్రయోగాత్మకంగా ప్రదర్శన ద్వారా విద్యార్థులకు చూపించారు.సైన్స్ యుగంలో మూఢనమ్మకాలు నమ్మవద్దని ప్రజలను చైతన్యవంతులుగా చేసేందుకు ఇలాంటి కార్యక్రమాలు ఎంతో దోహదపడతాయని స్థానిక ఎస్సై శ్రీనివాస్ రెడ్డిపేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో ఏఎస్ఐ జయపాల్ రెడ్డి,హెడ్ కానిస్టేబుల్ సునీత, కానిస్టేబుల్ బన్సీలాల్, రాజు ప్రిన్సిపాల్ అజిత్, ఉపాధ్యాయులు విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *