Gun Fire in Hyderabad:మణికొండలో కాల్పుల కలకలం
హైదరాబాద్ నగరంలో మరోసారి కాల్పుల కలకలం రేగింది. మణికొండ పంచవటి కాలనీలో భూవివాదం నేపథ్యంలో జరిగిన ఈ ఘటన స్థానికులను ఉలిక్కిపడేలా చేసింది. సమాచారం ప్రకారం, ఆంధ్రప్రదేశ్ మాజీ ఉప ముఖ్యమంత్రి కృష్ణమూర్తి తమ్ముడు ప్రభాకర్, భూమి ఖాళీ చేయాలని స్థానికులను బెదిరించి గాల్లోకి మూడు రౌండ్లు కాల్పులు జరిపినట్లు తెలుస్తోంది. ఘటనతో భయపడిన స్థానికులు వెంటనే అక్కడి నుంచి పారిపోయారు. అనంతరం ప్రభాకర్ అనుచరులు బాధితులను స్థలంలోనుంచి బయటకు పంపి, గేటుకు తాళాలు వేసినట్లు సమాచారం….
