“భరతనాట్యం” సినిమా సమీక్ష: అనివార్యమైన కథా లేమి, నిరుత్సాహపరచే ప్రతిపాదనలు
‘దొరసాని’ సినిమాతో దర్శకుడిగా మంచి గుర్తింపు తెచ్చుకున్న కేవీఆర్ మహేంద్ర, ‘భరతనాట్యం’ అనే సినిమాను తెరకెక్కించాడు. ఏప్రిల్ 5వ తేదీన థియేటర్లకు ఈ సినిమా వచ్చింది. అయితే పెద్దగా పబ్లిసిటీ లిపోవడం వలన, థియేటర్లకు ఈ సినిమా వచ్చి వెళ్లిన విషయం కూడా చాలామందికి తెలియదు. అలాంటి ఈ సినిమా ఈ నెల 27వ తేదీ నుంచి ‘ఆహా’లో స్ట్రీమింగ్ అవుతోంది. సిటీలో దిల్ సుఖ్ నగర్ దివాకరం (హర్షవర్ధన్) లోకల్ గ్యాంగ్ లీడర్. తమ్ముడు రంగమతి…
కేరళలో కొండచరియలు విరిగిపడడం: 80 మృతదేహాలు, 600 మంది కార్మికుల ఆచూకీ లభ్యం
కేరళలోని వయనాడ్ జిల్లాలో 600 మంది వరకు వలస కార్మికుల ఆచూకీ గల్లంతైంది. ఇక్కడ కొండచరియలు విరిగిపడి చాలామంది ప్రాణాలు కోల్పోయారు. అయితే ముండకై ప్రాంతంలోని తేయాకు, కాఫీ తోటలలో పని చేసేందుకు పశ్చిమ బెంగాల్, అసోం రాష్ట్రాల నుంచి వచ్చిన వందలాది మంది కార్మికులు కనిపించకుండా పోయారు. స్థానికంగా మొబైల్ ఫోన్ నెట్ వర్క్ కూడా పని చేయడం లేదు. ముండకై ప్రాంతంలోని హారిసన్ మలయాళి ప్లాంటేషన్ లిమిటెడ్‌లో పని చేసేందుకు వీరంతా వచ్చారు. వీరు…
హోంమంత్రి అనిత విశాఖలో సమీక్ష: గంజాయి నివారణ, పోలీసుల సంక్షేమంపై వ్యాఖ్యలు
రాష్ట్రంలో పోలీసుల సంక్షేమం, గంజాయి నివారణ, ఇతర అంశాలపై హోంమంత్రి అనిత జిల్లా ఎస్పీలతో విశాఖలో నేడు సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూచ గంజాయి నివారణపై మంత్రివర్గ ఉపసంఘం నియమించినట్టు వెల్లడించారు. ఏజెన్సీ ప్రాంతంలో గంజాయి సాగుపై సీసీ కెమెరాలతో నిఘా వేస్తామని చెప్పారు. గంజాయిని కట్టడి చేసేందుకు అన్ని జిల్లాల్లో ప్రత్యేక డ్రైవ్ నిర్వహిస్తామని అనిత పేర్కొన్నారు. డ్రగ్స్ సేవించినట్టు నిర్ధారించే పరికరాలు అందుబాటులో లేవని, గత ఐదేళ్లలో పోలీసు వ్యవస్థను నిర్వీర్యం…
శ్రీశైలం వద్ద కృష్ణా నది పొంగడం: 5 గేట్లు తెరిచి నీటిని విడుదల.
శ్రీశైలం వద్ద కృష్ణా నది పరవళ్లు తొక్కుతోంది. కర్ణాటకలో కురుస్తున్న భారీ వర్షాలకు కృష్ణా నది పొంగి ప్రవహిస్తోంది. శ్రీశైలం డ్యామ్ లో నీటిమట్టం గంటగంటకు పెరుగుతోంది. తాజాగా అధికారులు మరో రెండు గేట్లను ఎత్తారు. మొత్తం 5 గేట్ల ద్వారా నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. కాగా, ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు ఆగస్టు 1న శ్రీశైలం ప్రాజెక్టు వద్దకు రానున్నారు. కృష్ణమ్మకు ఆయన జలహారతి ఇవ్వనున్నారు. ఈ మేరకు తెలుగుదేశం పార్టీ సోషల్ మీడియా ద్వారా…
రెండో విడత పంట రుణాల మాఫీ: 6.4 లక్షల రైతులకు 6,190 కోట్లు విడుదల
రెండో విడత పంట రుణాల మాఫీ నిధులు మంగళవారం విడుదలయ్యాయి. మొదటి దఫాలో రూ.1 లక్ష లోపు రుణాలు మాఫీ చేసిన రేవంత్ రెడ్డి ప్రభుత్వం, ఈసారి రూ.లక్షన్నర లోపు ఉన్న రుణాలను మాఫీ చేసింది. ఈ నిధులను సీఎం రేవంత్ రెడ్డి మంగళవారం అసెంబ్లీ ప్రాంగణంలో విడుదల చేశారు. ఈ కార్యక్రమంలో ముఖ్యమంత్రితో పాటు మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు పాల్గొన్నారు. లక్ష నుంచి లక్షన్నర రూపాయల లోపు రుణాలను ఇప్పుడు మాఫీ చేస్తున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది….
