తలలో పేలు ప్రయాణికురాలి కారణంగా విమానానికి అత్యవసర ల్యాండింగ్
సాధారణంగా ఏదైనా సాంకేతిక సమస్య ఎదురైనా, ప్రయాణికుల్లో ఎవరికైనా అత్యవసర వైద్య సాయం అవసరమైనా, బాంబు బెదిరింపులు వచ్చినా విమానాన్ని అత్యవసరంగా ల్యాండ్ చేస్తుంటారు. కానీ, ఇది మాత్రం అందుకు పూర్తిగా భిన్నం. ప్రయాణికురాలి తలలో పాకుతున్న పేలు విమానాన్ని ఎమర్జెన్సీ ల్యాండింగ్ చేయించాయి. నమ్మడానికి ఆశ్చర్యంగా, వింతగా ఉన్నా ఇది నిజం. లాస్ ఏంజెల్స్ నుంచి న్యూయార్క్ వెళ్తున్న అమెరికా ఎయిర్‌లైన్స్ విమానంలో ఈ ఘటన జరిగింది. ఓ మహిళ తలలో పేలు పాకుతుండడాన్ని చూసిన…
Article 370 రద్దుకు ఐదేళ్లు .జమ్మూకశ్మీర్‌లో కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు
జమ్మూకశ్మీర్‌కు స్వయం ప్రతిపత్తి కల్పించే ఆర్టికల్ 370ని కేంద్ర ప్రభుత్వం రద్దు చేసి నేటికి ఐదేళ్లు పూర్తయిన సందర్భంగా కేంద్రం అప్రమత్తమైంది. అక్కడ ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా భద్రతను కట్టుదిట్టం చేసింది. లోయలో ఇటీవల ఉగ్రవాదులు చెలరేగిపోతున్న నేపథ్యంలో భద్రతా దళాలను కేంద్రం అలర్ట్ చేసింది. సైనిక సిబ్బందిని తరలించే కాన్వాయ్‌లపై ఉగ్రదాడి జరిగే అవకాశం ఉందన్న నిఘా వర్గాల సమాచారంతో కాన్వాయ్‌ల రాకపోకలను నిలిపివేసింది. అమర్‌నాథ్ యాత్ర వాహనాలపైనా ఇలాంటి ఆంక్షలే విధించింది. అలాగే,…
