admin

సిసిలీ తీరంలో ఘోర ప్రమాదం: వ్యాపార దిగ్గజం మైక్ లించ్ గల్లంతు

ఇటలీలో ఘోర ప్రమాదం సంభవించింది. సిసిలీ తీరంలో తీవ్ర తుపాను వల్ల ఓ విలాసవంతమైన షిప్ మునిగిపోయింది. ఈ ప్రమాదంలో బ్రిటన్ దిగ్గజ వ్యాపారవేత్త మైక్ లించ్ సహా ఏడుగురు గల్లంతయ్యారు. సిసిలియన్ పోర్టు నుండి ఈయాట్ కు ఈ నెల 14న బయలుదేరిన నౌకలో పది మంది సిబ్బంది, 12 మంది ప్రయాణికులు ఉన్నారు. పోర్టిసెల్లో తీరానికి చేరుకున్న సమయంలో ప్రతికూల వాతావరణ పరిస్థితుల కారణంగా షిప్ మునిగిపోయినట్లు భావిస్తున్నారు.   ప్రమాదం జరిగిన వెంటనే…

Read More

అమెరికాలో వెనిగండ్ల రాముకు ఘన స్వాగతం, 100 కార్ల విజయోత్సవ ర్యాలీ

గుడివాడ ఎమ్మెల్యే వెనిగండ్ల రాముకు అమెరికాలో ఎన్నారైలు ఘన స్వాగతం పలికారు. ఈ సంద‌ర్భంగా 100 కార్లతో విజయోత్సవ ర్యాలీ నిర్వ‌హించ‌డం విశేషం. కుటుంబ వివాహ కార్యక్రమంలో పాల్గొనేందుకు అమెరికా వెళ్లిన ఆయ‌న‌కు ఇలా ఘ‌న స్వాగ‌తం ద‌క్కింది.  అట్లాంట విమానాశ్ర‌యంకు తెలుగు అసోసియేషన్ సభ్యులు భారీగా చేరుకుని రామును అభినందించారు. ఆ త‌ర్వాత‌ డౌన్ టౌన్ పార్కు నుంచి అలెగ్జాండర్ డ్రైవ్ అల్ఫారెట్టా వరకు టీడీపీ జెండాలతో ఎన్నారైలు విజయోత్సవ ర్యాలీ నిర్వహించారు.  ఈ సంద‌ర్భంగా…

Read More

వెలిగొండ ప్రాజెక్టుపై జగన్ నిరర్హత: మంత్రి గొట్టిపాటి విమర్శ

వెలిగొండ ప్రాజెక్టుపై మాట్లాడే అర్హత కూడా వైసీపీ అధినేత జగన్ కు లేదని ఏపీ మంత్రి గొట్టిపాటి రవికుమార్ అన్నారు. ఈ ప్రాజెక్టుకు గెజిట్ నోటిఫికేషన్ కూడా రాకుండా అడ్డుకున్నది జగనేనని విమర్శించారు. గతంలో చంద్రబాబు సూచనతో ప్రకాశం జిల్లా నేతలమంతా ఢిల్లీకి వెళ్లామని… ప్రాజెక్టు కోసం అప్పటి కేంద్ర మంత్రిని కలిశామని చెప్పారు. అయితే అప్పటి ముఖ్యమంత్రి కేసీఆర్ తో జగన్ కుమ్మక్కై రాష్ట్ర ప్రయోజనాలను తాకట్టు పెట్టారని మండిపడ్డారు. ఐదేళ్ల పాటు రాష్ట్రాన్ని నాశనం…

Read More

సీఎం చంద్రబాబు పంచాయతీ సమీక్ష: వ్యయం పెంపు, కొత్త యాప్

సీఎం చంద్రబాబు నేడు పంచాయతీరాజ్-గ్రామీణాభివృద్ధి శాఖపై సమీక్ష నిర్వహించారు. అమరావతిలోని రాష్ట్ర సచివాలయంలో నిర్వహించిన ఈ సమీక్ష సమావేశానికి డిప్యూటీ సీఎం, పంచాయతీరాజ్-గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి పవన్ కల్యాణ్, సంబంధిత శాఖ ఉన్నతాధికారులు హాజరయ్యారు.  గ్రామ పంచాయతీలకు స్వాతంత్ర్య, గణతంత్ర దినోత్సవ కార్యక్రమాల వ్యయం పెంపుపై నిర్ణయం తీసుకున్నారు. వేడుకల వ్యయాన్ని రూ.10 వేల నుంచి 25 వేలకు పెంచినట్టు సమీక్షలో వెల్లడించారు. గ్రామీణ ప్రాంతాల్లో పారిశుద్ధ్యం నిర్వహణకు ప్రత్యేక మొబైల్ యాప్ తీసుకువచ్చారు. మొబైల్ యాప్…

Read More

యూవీ రికార్డు బద్దలుకొట్టిన సమోవా క్రికెటర్

ఐసీసీ మెగా టోర్నీ టీ20 ప్రపంచ కప్‌-2026 సన్నాహకాల్లో భాగంగా జరుగుతున్న క్వాలిఫయర్‌ టోర్నీలో తాజాగా ఓ అరుదైన రికార్డు న‌మోదైంది. 28 ఏళ్ల‌ అనామక ఆట‌గాడు భారత స్టార్ క్రికెట‌ర్‌ యూవరాజ్ సింగ్ 17 ఏళ్ల రికార్డును బ‌ద్ద‌లు కొట్టాడు. 2007 టీ20 ప్ర‌పంచ‌క‌ప్‌లో యువీ ఆరు బంతుల్లో ఆరు సిక్స‌ర్లు బాదడం ద్వారా ఒకే ఓవర్లో 36 పరుగులు సాధించాడు. ఇప్పుడా రికార్డును సమోవా దేశ ఆటగాడు డేనియల్ విస్సెర్ బద్దలుకొట్టాడు. విస్సెర్ ఒకే…

Read More

బుమ్రా వ్యాఖ్యలపై బాసిత్ అలీ స్పందన

జ‌ట్టు నాయకత్వ బాధ్య‌త‌ల‌కు పేస్ బౌలర్లకు అవకాశాలు అంత‌గా లేవని భారత ఫాస్ట్ బౌల‌ర్‌ జస్ప్రీత్ బుమ్రా చేసిన వ్యాఖ్యలపై పాకిస్థాన్ మాజీ క్రికెటర్ బాసిత్ అలీ స్పందించాడు. గత నెలలో ఒక ఇంటర్వ్యూలో బుమ్రా మాట్లాడుతూ ఫాస్ట్ బౌలర్లు అద్భుతమైన కెప్టెన్సీ చేయగలర‌ని అన్నాడు. దానికి ఉదాహ‌ర‌ణగా కపిల్ దేవ్, ఇమ్రాన్ ఖాన్ విజయవంతమైన కెప్టెన్సీలను పేర్కొన్నాడు. వారి సార‌థ్యంలోనే ఇరు దేశాలు  ప్రపంచ కప్ విజేత‌లుగా నిలిచాయ‌ని బుమ్రా చెప్పుకొచ్చాడు. అయితే, బాసిత్ అలీ…

Read More