ఆర్‌బీఐ 90 క్విజ్: లక్షల బహుమతుల కోసం విద్యార్థులకు అవకాశం
భారతీయ రిజర్వు బ్యాంకు (ఆర్‌బీఐ) స్థాపించి 90 ఏళ్లు పూర్తయింది. ఈ సందర్భాన్ని పురస్కరించుకుని కాలేజీ విద్యార్థుల కోసం ‘ఆర్‌బీఐ 90 క్విజ్’ను ప్రకటించింది. ఈ పోటీలో విజయం సాధించిన విద్యార్థులు రూ. 10 లక్షల బహుమతి గెలుచుకోవచ్చు. దేశవ్యాప్తంగా నిర్వహించనున్న ఈ పోటీ కోసం ఆన్‌లైన్‌లో ఆడిషన్స్ నిర్వహిస్తారు. అనంతరం వివిధ దశల్లో రాష్ట్ర చాంపియన్‌ను ఎంపిక చేస్తారు. వారు ఆ తర్వాత జాతీయ స్థాయిలో పోటీపడాల్సి ఉంటుంది. అక్కడ గెలిచిన వారికి రూ. 10…
