admin

కాంగ్రెస్ సీనియర్ నేత వసంత్ చవాన్ కన్నుమూత

కాంగ్రెస్ సీనియర్ నేత, నాందేడ్ ఎంపీ వసంత్ చవాన్ (69) అనారోగ్యంతో హైద‌రాబాద్‌లో కన్నుమూశారు. ఆయ‌న గత కొంతకాలంగా మూత్రపిండాల సమస్యతో బాధపడుతున్నట్లు ఆయ‌న కుటుంబ స‌భ్యులు తెలిపారు. దాంతో హైద‌రాబాద్‌లోని ఓ ప్రైవేట్ ఆసుప‌త్రిలో ఆయ‌న చికిత్స పొందారు. ఈ క్రమంలో సోమ‌వారం ఉద‌యం ఆయన తుదిశ్వాస విడిచారు.  మహారాష్ట్ర నాందేడ్ జిల్లాలోని నైగావ్‌ వసంత్ చవాన్ స్వ‌స్థ‌లం. 2002లో ఎమ్మెల్సీగా ఎన్నికయ్యారు. ఆ త‌ర్వాత‌ 2009 నుంచి 2014 వరకు నైగావ్ ఎమ్మెల్యేగా ఉన్నారు….

Read More

మూడో ప్రపంచ యుద్ధం ముంచుకొస్తోందని ట్రంప్ హెచ్చరిక

పశ్చిమాసియాలో పరిస్థితులను గమనిస్తూ మూడో ప్రపంచ యుద్ధం మరెంతో దూరంలో లేదనిపిస్తోందని అమెరికా మాజీ అధ్యక్షుడు, ప్రస్తుత అధ్యక్ష అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్ హెచ్చరించారు. అమెరికాను ప్రపంచ సంక్షోభంవైపు నడిపిస్తున్నారంటూ ప్రెసిడెంట్ జో బైడెన్, వైస్ ప్రెసిడెంట్ కమలా హారిస్ పై మండిపడ్డారు. పశ్చిమాసియాలో బాంబుల వర్షం కురుస్తుంటే నిద్రముఖం బైడెన్ కాలిఫోర్నియా బీచ్ లో నిద్రపోతున్నాడంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. పరస్పరం దాడులు చేసుకుంటున్న దేశాలతో చర్చలు జరిపే ప్రయత్నం చేయకుండా కమలా హారిస్ తీరిగ్గా…

Read More

కేరళలో 70 ఏళ్ల వృద్ధురాలిపై దారుణం, నిందితుడి అరెస్ట్

దేశంలో మహిళలపై జరుగుతున్న లైంగిక హింస, నేరాలపై తీవ్ర ఆందోళనలు వ్యక్తమవుతున్న వేళ మరో దారుణం వెలుగుచూసింది. కేరళలోని అలప్పుజా జిల్లాలో ఓ 70 ఏళ్ల వృద్ధురాలిపై అత్యాచారం జరిగింది. శనివారం రాత్రి జరిగిన ఈ ఘటనలో దొంగతనానికి వచ్చిన 29 ఏళ్ల ధనేష్ అనే నిందితుడు ఈ నేరానికి పాల్పడ్డాడు. ఆ తర్వాత ఇంట్లోని నగలు దోచుకున్న అనంతరం వృద్ధురాలి కళ్లలో కారం చల్లి నిందితుడు పారిపోయాడని పోలీసులు వివరించారు. వృద్ధురాలు ఎవరికీ సమాచారం ఇవ్వకుండా…

Read More

ఉపాధ్యాయుడు మత్తులో నిద్ర: కామాఖ్యనగర్‌లో ఉద్రిక్త పరిస్థితులు

తల్లిదండ్రుల తర్వాత ఉపాధ్యాయులకే మన సంస్కృతి ప్రాధాన్యం ఇచ్చింది. విద్యార్థుల్లో స్ఫూర్తినింపి వారి భవిష్యత్తును బంగారుమయం చేసే బాధ్యతను సమాజం వారిపైనే పెట్టింది. అయితే, అలాంటి గురువుల్లో కొందరు నీచంగా ప్రవర్తిస్తూ మొత్తం ఉపాధ్యాయ వ్యవస్థకే కళంకం తెస్తున్నారు. తాజాగా వైరల్ అవుతున్న వీడియో ఇందుకు ప్రత్యక్ష నిదర్శనం. పూటుగా తాగి బడికి వచ్చిన ఉపాధ్యాయుడికి ఆ తర్వాత మత్తు మరింత ఎక్కువైంది. కుర్చీలో కూలబడి అలాగే నిద్రపోయాడు. విద్యార్థులు, సహచర ఉపాధ్యాయులు అతడిని లేపేందుకు ప్రయత్నించినా…

Read More

టీం బిల్డింగ్ ఈవెంట్‌లో వేధింపులు, మహిళా ఉద్యోగి రాజీనామా

పని ప్రదేశంలో మహిళలకు ఎదురవుతున్న వేధింపులకు ఇదో ప్రత్యక్ష ఉదాహరణ. కంపెనీ టీం బిల్డింగ్ ఈవెంట్‌లో తనను ముద్దాడతానని తండ్రి వయసున్న ఉద్యోగి ఒకరు బెదిరించడంతో ఇంటర్న్‌షిప్ చేస్తున్న మహిళా ఉద్యోగి రాజీనామా చేశారు. వియత్నాంలో జరిగిన ఈ ఘటన మహిళ భద్రతపై మరోమారు ప్రశ్నలు లేవనెత్తింది.  ‘సౌత్ చైనా మార్నింగ్ పోస్ట్’ కథనం ప్రకారం.. బాధిత మహిళ హుయన్హ్ మై గత ఏడాది కంపెనీ నిర్వహించిన ఈవెంట్‌లో తప్పనిసరిగా పాల్గొనాల్సి వచ్చింది. ఈ టీం బిల్డింగ్…

Read More

ఉక్రెయిన్‌కు మద్దతు కోరిన జెలెన్ స్కీ, శాంతి హామీ ఇచ్చిన మోదీ

ఉక్రెయిన్ సార్వభౌమత్వం కాపాడుకోవడానికి పోరాడుతున్న తమకు భారత్ అండగా నిలబడాలని ఆ దేశ ప్రెసిడెంట్ వొలొదిమిర్ జెలెన్ స్కీ భారత ప్రధాని నరేంద్ర మోదీకి విజ్ఞప్తి చేశారు. తటస్థంగా ఉండొద్దని కోరారు. దీనిపై ప్రధాని మోదీ స్పందిస్తూ.. భారత్ ఎల్లప్పుడూ శాంతి వైపే నిలబడుతుందని హామీ ఇచ్చారు. ఉక్రెయిన్, రష్యా యుద్ధంలో తాము తటస్థంగా లేమని వివరించారు. యుద్ధాన్ని నిలవరించేందుకు ఎలాంటి సాయానికైనా తాను ముందుంటానని ఈ సందర్భంగా మోదీ పేర్కొన్నారు. ఉక్రెయిన్ పర్యటనలో భాగంగా కీవ్…

Read More

సౌదీ ఎడారిలో చిక్కుకుపోయిన తెలంగాణ యువకుడు మృతి

సౌదీ అరేబియా ఎడారిలో త‌ప్పిపోయిన తెలంగాణ యువ‌కుడు మహ్మద్ షాజాద్ ఖాన్ ద‌య‌నీయ‌స్థితిలో చనిపోయాడు. సైదీలో ఓ టెలికమ్యూనికేషన్ కంపెనీలో ప‌ని చేస్తున్న‌ అత‌డు ఐదు రోజుల కింద‌ త‌న తోటి ఉద్యోగితో క‌లిసి ఓ చోటుకు వెళ్లారు. అయితే, జీపీఎస్ ప‌ని చేయ‌క‌పోవ‌డంతో దారి త‌ప్పి ప్ర‌మాద‌క‌ర‌మైన రబ్ అల్ ఖ‌లీ అనే ఎడారిలోకి వెళ్లిపోయారు.  అదే స‌మ‌యంలో వాహ‌నంలో పెట్రోల్ అయిపోవ‌డం, మొబైల్ స్విచ్ఛాఫ్ కావ‌డంతో అందులోనే చిక్కుకుపోయారు. నాలుగు రోజులుగా విప‌రీత‌మైన‌ ఎండలో…

Read More