అస్సాంలో బాలికపై సామూహిక అత్యాచారం. న్యాయానికి అణచివేత
అత్యాచారం అంటే ఏంటని తన అత్తయ్యను అడిగిన బాలిక ఆ తర్వాత రెండు రోజుల్లోనే సామూహిక లైంగికదాడికి గురైంది. అస్సాంలోని నాగావ్ జిల్లాలో ఈ నెల 22న జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. కోల్‌కతాలో ట్రైనీ వైద్యురాలిపై అత్యాచారం, హత్యకేసుకు సంబంధించిన వార్తలను రోజూ చూస్తున్న బాలిక.. అసలు అత్యాచారం అంటే ఏంటని తన అత్తను ప్రశ్నించింది. ఆ తర్వాత రెండు రోజులకే 22న ట్యూషన్ నుంచి ఇంటికొస్తున్న బాలికను అడ్డగించిన కొందరు యువకులు…
