సుల్తాన్ ఆఫ్ జోహార్ కప్: భారత్-పాక్ జూనియర్ హాకీ డ్రా, ఆటగాళ్ల స్నేహభావం
భారత్, పాకిస్థాన్ మధ్య రాజకీయ ఉద్రిక్తత కొనసాగుతున్న నేపథ్యంలో, క్రీడా మైదానంలో ఒక హృదయానందకరమైన దృశ్యం సృష్టించబడింది. సుల్తాన్ ఆఫ్ జోహార్ కప్‌లో భాగంగా జూనియర్ హాకీ జట్ల మధ్య జరిగిన మ్యాచ్‌లో, ఇరు దేశాల ఆటగాళ్లు ఒకరికొకరు స్నేహపూర్వకంగా కరచాలనం చేసుకున్నారు. కొద్ది వారాల క్రితం ఆసియా కప్‌లో క్రికెట్ జట్లు ఒకరికొకరు చేతులు కలపకపోవడం భిన్నంగా, ఈ హాకీ మ్యాచ్ క్రీడాస్పూర్తిని ప్రతిబింబించింది. మంగళవారం జరిగిన మ్యాచ్ ప్రారంభంలో జాతీయ గీతాలాపన తరువాత ఇరు…
