నైపుణ్య శిక్షణతో పాటు ఉన్నత విద్యకు ప్రభుత్వం అండ – సీఎం చంద్రబాబు స్పష్టం
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో యువతకు నైపుణ్యాభివృద్ధి, ఉన్నత విద్య, ఉద్యోగ అవకాశాలు కల్పించే దిశగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నూతన దిశానిర్దేశాలు ఇచ్చారు. గురువారం సచివాలయంలో జరిగిన నైపుణ్యాభివృద్ధి శాఖ సమీక్షా సమావేశంలో ఆయన మాట్లాడుతూ, “యువతకు కేవలం శిక్షణ కాదు, ఉన్నత విద్యకు కూడా ప్రభుత్వం సహకరిస్తుంది. ‘నైపుణ్యం పోర్టల్’ రాష్ట్ర యువతకు ఉద్యోగ గేట్‌వేగా ఉండాలి” అని స్పష్టం చేశారు. ప్రతి నియోజకవర్గంలో ప్రతి నెలా జాబ్ మేళాలు నిర్వహించాలని ఆయన అధికారులకు ఆదేశించారు….
