నాలుగు నెలల్లో జరిగిన నాలుగు దొంగతనాలకు సంబంధించిన అంతర్ రాష్ట్ర దొంగల ముఠాను పట్టుకొని అరెస్టు చేసి రిమాండ్ తరలించినట్లు మెదక్ జిల్లా ఎస్పీ ఉదయ్ కుమార్ రెడ్డి తెలిపారు మెదక్ జిల్లాలో అంతర్రాష్ట్ర దొంగల ముఠా గత నాలుగు నెలల నుండి కామారెడ్డి జిల్లా నాగిరెడ్డిపేట మండలం గోపాల్పేట రామాలయం దేవాలయం, హావేల్ ఘనపుర్ మండలంలోని పోచమారాల్ తండాలో తాళం వేసిన ఇంటి తాళమును పగలగొట్టి దొంగతనం తో పాటు చిన్న శంకరంపేట మండలంలోని గవ్వల పల్లి గ్రామంలోని దుర్గామాత గుడి తాళం పగలగొట్టి అమ్మవారి వెండి కిరీటం, షటగోపం, మరియు వెండి ప్లేట్లను అక్కడ దొంగతనాలకు పాల్పడడం జరిగింది అదేవిధంగా చేగుంట మండలంలోని చందాయి పేట గ్రామంలో హనుమాన్ దేవాలయంలో దొంగతనాలు జరగడంతో పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు ఈరోజు ఉదయం 8 గంటలకు గవ్వలపల్లి చవరస్తవద్ద వాహనాలు తనిఖీలు చేస్తుండగా అనుమానస్పదంగా వెళ్తున్న టాటా మాంజా కారును ఆపగా తప్పించుకొని పారిపోయే ప్రయత్నం చేయడంతో పోలీసులు వారి కారును వెంబడించి పట్టుకొని విచారించగా పలు దొంగతనాలు చేసినట్లు వెల్లడించారు, నెల రోజులలో చిన్న శంకరంపేట మండలంలో జరిగిన దొంగతనo తోపాటు వివిధ ప్రాంతాల్లో దొంగతనానికి పాల్పడ్డ వారిని పట్టుకునేందుకు కృషి చేసిన డిఎస్పి వెంకటరెడ్డి సిఐ వెంకటరాజా గౌడ్ తో పాటు చిన్న శంకరంపేట ఎస్సై నారాయణ గౌడ్ కానిస్టేబుల్ రాజశేఖర్ భాస్కర్లను మెదక్ జిల్లా ఎస్పీ ఉదయ్ కుమార్ రెడ్డి అభినందించారు దొంగతనానికి పాల్పడ్డ అస్లాం ఖాన్, షేక్ ఇలియాస్, షేక్ సమీర్లను, అరెస్టు చేసి రిమాండ్ కు తరలించారు అనంతరం ఎస్పీ ఉదయ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ కామారెడ్డి మెదక్ జిల్లాలో దొంగతనాలకు పాల్పడ్డ అంతర్ రాష్ట్ర దొంగల ముఠాను పట్టుకోవడం జరిగిందని మహారాష్ట్రలోని నాందేడ్ కు చెందిన ముగ్గురు దొంగలను పట్టుకొని అరెస్టు చేయడం జరిగిందని వారి వద్ద నుండి మూడు సెల్ ఫోన్లు ఒక కారు ఐదు లక్షల 50 వేల రూపాయల విలువ చేసే వస్తువులతో పాటు 13700 నగదును స్వాధీనం చేసుకున్నట్లు ఆయన తెలిపారు దొంగలను పట్టుకునేందుకు చాక చెక్యంగా వ్యవహరించి అంతర్ రాష్ట్ర దొంగలను పట్టుకున్న రామాయంపేట సిఐ వెంకటరాజా గౌడ్ చిన్న శంకరంపేట ఎస్సై నారాయణ గౌడ్ తో పాటు కానిస్టేబుల్ లను ఆయన అభినందించారు అనంతరం ఎస్సై తో పాటు ఇద్దరు కానిస్టేబుళ్లకు రివార్డును అందజేశారు ఈ కార్యక్రమంలో మెదక్ జిల్లా ఎస్పీ ఉదయ్ కుమార్ రెడ్డి తో పాటు తూప్రాన్ డిఎస్పి వెంకటరెడ్డి రామాయంపేట సిఐ వెంకటరాజా గౌడ్ చిన్న శంకరంపేట ఎస్సై నారాయణగౌడ్ పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు
అంతర్ రాష్ట్ర దొంగల ముఠా అరెస్టు
The Medak district SP announced the arrest of an interstate gang involved in multiple thefts over the past four months, recovering valuable items and cash.
