అమలాపురం కిమ్స్ హాస్పిటల్ ప్రాంగణంలో ఏపీ.ఎం.ఎఫ్ రాష్ట్ర అధ్యక్షులు ఢిల్లీ బాబు రెడ్డి నాయకత్వంలో రాష్ట్రంలోని నలుమూలల నుండి డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలో మొట్టమొదటి మహాసభ ఏర్పాటు చేశారు. కార్యక్రమంలో స్థానిక శాసనసభ్యులు అయితా బత్తుల ఆనందరావు హాజరై
జర్నలిస్టుల సంక్షేమానికి కృషి చేస్తానని ఇండ్ల స్థలాలు ఇచ్చే విషయంలో గాని అక్రిడేషన్ల విషయంలో గానీ ప్రభుత్వ పెద్దలతో మాట్లాడతానని హామీ ఇచ్చారు.ఈ కార్యక్రమం లో మాజీ ఎమ్మెల్సీ రెడ్డి సుబ్రమణ్యం మాట్లాడుతూ జర్నలిస్టులకు ప్రత్యేక చట్టాలు ఏర్పాటు చేయాలని దానికి అనుగుణంగా నేను కూడా సమావేశంలో మాట్లాడుతానని తెలిపారు కార్యక్రమంలో ఎమ్మెల్సీ బొమ్మి ఇజ్రాయేలు మున్సిపల్ చైర్మన్ రెడ్డి సత్య నాగేంద్రమణి,మెట్ల రమణ బాబు,యాళ్ల దొరబాబు, మోకా వెంకట సుబ్బారావు, సతీష్ రాజు,బొర్రా ఈశ్వర రావు, రాష్ట్ర నలుమూలల నుండి అధిక సంఖ్యలో పాల్గొన్న ఏపీఎంఎఫ్ కమిటీ జర్నలిస్టులు.
అమలాపురంలో ఏపీఎంఎఫ్ మహాసభ
