టాలీవుడ్ హీరో రాజ్ తరుణ్ ప్రియురాలు లావణ్య వ్యవహారంలో ఆరోపణలు చేసిన బిగ్ బాస్ ఫేమ్ శేఖర్ బాషాపై మరో కేసు నమోదైంది. కొరియోగ్రాఫర్ శ్రేష్టి వర్మ నార్సింగి పోలీసులకు ఫిర్యాదు చేసి, అతను తన వ్యక్తిగత కాల్ రికార్డును లీక్ చేశాడని ఆరోపించింది.
ఇంతకుముందు శ్రేష్టి వర్మ, ప్రముఖ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్‌పై కూడా కేసు పెట్టిన విషయం తెలిసిందే. జానీ మాస్టర్ విచారణలో ఉన్న సమయంలోనే శేఖర్ బాషా తన ప్రైవేట్ కాల్స్‌ను బయటపెట్టాడని ఆమె ఫిర్యాదులో పేర్కొంది.
తన పరువుకు భంగం కలిగేలా యూట్యూబ్ ఛానెల్‌లో శేఖర్ బాషా మాట్లాడుతున్నాడని శ్రేష్టి వర్మ అభ్యంతరం వ్యక్తం చేసింది. ఈ నేపథ్యంలో అతనిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని కోరింది.
పోలీసులు బీఎన్ఎస్ యాక్ట్ సెక్షన్ 79, 67, ఐటీ యాక్ట్ 72 కింద శేఖర్ బాషాపై కేసు నమోదు చేశారు. ఉద్దేశపూర్వకంగానే ప్రైవేట్ కాల్స్ లీక్ చేశాడని ఎఫ్ఐఆర్‌లో స్పష్టం చేశారు.