చదువుతూనే నేటి యువతకు బంగారు భవిష్యత్తు ఏర్పడుతుందని ప్రతి ఒక్కరూ చదువుకొని ఆర్థికంగా స్థిరపడి కన్న తల్లిదండ్రులకు,కాపు వర్గం ,అన్ని కులాల వారు సమాజానికి ఉపయోగపడాలని మాజీ ఎమ్మెల్సీ అన్నం సతీష్ ప్రభాకర్ అన్నారు. కాపు సేవా సంఘం బాపట్ల ఆధ్వర్యంలో నిర్వహించిన కాపు కార్తీక వన సమరాధన కార్యక్రమాన్ని సూర్యలంక రహదారిని అనుకొని ఉన్న జీడీ మామిడి తోట లో నిర్వహించారు.
పర్వత రెడ్డి భాస్కరరావు కార్యక్రమానికి అధ్యక్షత వహించారు. కాపు సేవా సంఘము అధ్యక్షులు ఇక్కుర్తి శ్రీనివాసరావు ,కమిటీ మెంబర్లు ఎంతో సుందర వందనంగా కార్యక్రమాన్ని చేపట్టారు అని ముఖ్య అతిధి గా పాల్గొన్న ఎమ్ ఎమ్ భాస్కరరావు కొనియడారు.
ఆల్ ఇండియా యూనియన్ బ్యాంక్ పెన్షనర్స్ అసోసియేషన్ చైర్మన్ మెండు మహేంద్ర భాస్కరరావు మాట్లాడుతూ మాజీ ఎమ్మెల్సీ అన్నం సతీష్ ప్రభాకర్ ను ఇంత పెద్ద కార్యక్రమం చేస్తున్నందుకు ప్రత్యేకంగా అభినందించారు. ఆయన కాపు కులానికే కాకుండా అందరిని చేర తీసి కలుపుకుని పోయే ఏకైక వ్యక్తి అన్నం సతీష్ అని తెలిపారు.
విద్యార్థులు సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించి ఎంతగానో అలరించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా బాపట్ల, చీరాలకు చెందిన కాపు కులస్తులైన వైద్యులు హాజరై ప్రసంగించారు. అనంతరం అన్నం సతీష్ ప్రభాకర్ మాట్లాడుతూ బాపట్ల నియోజకవర్గం లో ఉన్న కాపు కులస్తుల సహాయ సహకారాలతో కాపు కళ్యాణ మండపాన్ని నిర్మించి దాని ద్వారా వచ్చే ఆదాయంతో పాటు మరి కొంత ఆదాయాన్ని తన వ్యక్తిగతంగా అందజేసి గత 22 సంవత్సరాలుగా నియోజకవర్గంలోని కాపు కులానికి చెందిన వివిధ విద్య కోర్సులు చేస్తున్న విద్యార్థులకు నగదు పురస్కారాన్ని అందజేస్తున్నామని చెప్పారు. ఈ సంవత్సరం 465 మంది విద్యార్థులకు 19 లక్షల రూపాయల నగదు పురస్కారాన్ని అందించామని రానున్న రోజుల్లో వందల మంది విద్యార్థులకు వారి విద్యకు అవసరమయ్యే ఆర్థిక చేయూతను అందించేందుకు కాపు సేవా సంఘం ఎల్లప్పుడూ ముందుంటుంది అన్నారు. ప్రధానంగా ఈ వన సమారాధన కు వచ్చిన వైద్యులకు అనేక సూచనలు చేశారు. బాపట్ల నియోజకవర్గం నుండి వైద్యశాలలకు వచ్చే కాపులకు అతి తక్కువ నగదు తీసుకొని నాణ్యమైన వైద్యాన్ని అందించి కాపుకులానికి,కాపు కులస్తులకు అండగా నిలబడాలని కోరారు. విద్యార్థులకు వారి జీవితానికి విద్య ప్రధానమని ప్రతి ఒక్కరికి గౌరవం రావాలంటే విద్యతోనే ముడిపడి ఉందన్నారు. తల్లితండ్రులు విద్యార్థులని ఎంతో కష్టపడి చదివిస్తున్నారని కష్టానికి తగ్గట్టుగా విద్యార్థులు ఎంతో కసిగా చదువుకొని ఉన్నత స్థానాలకు ఎదగాలని ఆయన కోరారు. 22 సంవత్సరాలుగా కాపు సేవా సంఘం ఆధ్వర్యంలో వివిధ సేవా కార్యక్రమాలు చేస్తున్న కమిటీ సభ్యులను అభినందించారు. అనంతరం వైద్యులతో పాటు కమిటీ సభ్యులను,ప్రముఖులను సన్మానించారు. అనంతరం సుమారు పదివేల మందికి అన్నసంతర్పణ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆల్ ఇండియా యూనియన్ బ్యాంక్ పెన్షనర్స్ చైర్మన్ మెండు మహేంద్ర భాస్కరరావు, డా.చైతన్య మురళి, డా.ఇమ్మడిశెట్టి మారుతి ప్రసాద్ రావు, డా.మెండు అవంతి, డా.శంకర్ శెట్టి కొండలరావు,డా. కంఠ జగదీష్, డా.మారిశెట్టి రాజ్యలక్ష్మి, డా. విన్నకోట నారాయణరావు,డా. ఎం హనుమంతరావు నాయుడు,కాపు సేవా సంఘం అధ్యక్షులు ఇక్కుర్తి శ్రీనివాసరావు, భాస్కరరావు తదితరులు పాల్గొన్నారు.
