పైడితల్లి అమ్మవారి ఉత్సవాలకు రావాలని ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రివర్యులు ఆనం రామనారాయణరెడ్డి ని ఆహ్వానించిన మంత్రి కొండపల్లి, ఎంపీ కలిశెట్టి, MLA అదితి.
మాజీ కేంద్రమంత్రి శ్రీ పూసపాటి అశోక్ గజపతిరాజు వంశీయుల ఆహ్వానం మేరకు నేడు ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రివర్యులు ఆనం రామనారాయణరెడ్డి కలిసి
అక్టోబర్ 13,14,15 లో జరగనున్న పైడితల్లి అమ్మవారి సిరిమాను మహోత్సవాలకు రావాలని ఆహ్వానించి, దేశ విదేశాల నుండి ఈ మహోత్సవాలకు అమ్మవారి భక్తులు వస్తారని, అలాంటి విశిష్టత కలిగిన మహోత్సవాలకు తప్పనిసరిగా రావాలని మంత్రివర్యులని ఆహ్వనించారు.
*ఈ సందర్భంగా పైడితల్లి అమ్మవారి ఆలయం నుండి తీసుకెళ్లిన ప్రసాదాన్ని ఆనం రామనారాయణ రెడ్డి కి అందించిన మంత్రివర్యులు శ్రీ కొండపల్లి శ్రీనివాస్ విజయనగరం MP కలిశెట్టి అప్పలనాయుడు విజయనగరం MLA శ్రీ అదితి విజయలక్ష్మి గజపతిరాజు
ఈ కార్యక్రమంలో దేవాదాయ శాఖ కమిషనర్ గారు, పైడితల్లి అమ్మవారి ఆలయ EO మరియు ప్రముఖులు పాల్గొన్నారు.
