విషు మంచు ప్రధాన పాత్రలో, ముఖేశ్ కుమార్ సింగ్ దర్శకత్వంలో నిర్మితమవుతున్న చిత్రం “కన్నప్ప”. ఈ చిత్రాన్ని అవా ఎంటర్‌టైమెంట్స్, 24 ఫ్రేమ్స్ ఫ్యాక్టరీ బ్యానర్లపై మోహన్ బాబు భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్నారు. ఈ సినిమా భారీగా ప్రేక్షకులను ఆకట్టుకునే పాత్రలతో రూపొందించబడింది.
ఇందులో బాలీవుడ్ నుంచి అక్షయ్ కుమార్, మోహన్ లాల్, టాలీవుడ్ నుంచి ప్రభాస్, కోలీవుడ్ నుంచి శరత్ కుమార్, ప్రభుదేవా వంటి స్టార్ హీరోలు నటిస్తున్నారు. ఇప్పటికే ఈ చిత్రంలోని ముఖ్య పాత్రల పోస్టర్స్ విడుదలయ్యాయి, అలాగే ‘కన్నప్ప’ టీజర్ కూడా ప్రేక్షకులకు అందించబడింది.
ఈ సినిమాలో అక్షయ్ కుమార్ శివుడి పాత్రలో నటిస్తున్నాడు. ఇటీవల శివుడి పాత్రలో అక్షయ్ కుమార్ ఫస్ట్ లుక్ పోస్టర్ విడుదలైంది. ఈ పోస్టర్‌లో అక్షయ్ కుమార్ త్రిశూలం మరియు ఢమరుకం పట్టి నాట్యం చేస్తున్నట్లు చూపించబడింది. పోస్టర్‌పై “ముల్లోకాలు ఏలే పరమశివుడు భక్తికి మాత్రం దాసుడు” అని సందేశం ఉంది.
ఈ చిత్రానికి సంబంధించిన ప్రచార కార్యక్రమాలు ఇప్పటికే ప్రారంభమైయ్యాయి. బెంగళూరు, చెన్నై ప్రాంతాల్లో చిత్రబృందం తిరుగుతూ “కన్నప్ప” సినిమాను జనాలకు దగ్గరగా తీసుకెళ్ళే ప్రయత్నం చేస్తున్నారు. ఈ చిత్రం ఏప్రిల్ 25న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది.