అక్కినేని ఇంట పెళ్లి సంబరాలు మరోసారి ప్రారంభం కానున్నాయి. ఇటీవల నాగచైతన్య, శోభితల వివాహం ఘనంగా జరగగా, ఇప్పుడు అఖిల్ పెళ్లికి ముహూర్తం ఖరారైనట్టు సమాచారం. అఖిల్ తన ప్రేయసి జైనాబ్‌ను మార్చి 24న వివాహం చేసుకోనున్నట్లు టాలీవుడ్ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది.
ఈ ఏడాది ప్రారంభంలోనే అఖిల్, జైనాబ్‌ల ఎంగేజ్‌మెంట్ నాగచైతన్య వివాహ వేడుకలో జరిగింది. దీనికి సంబంధించిన ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ఇప్పుడు పెళ్లి తేదీ కూడా ఖరారవడంతో అక్కినేని ఫ్యామిలీ పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేస్తున్నట్టు తెలుస్తోంది.
నాగార్జున తన చిన్న కుమారుడి వివాహాన్ని గ్రాండ్‌గా చేయాలని ప్లాన్ చేస్తున్నారు. సినీ, రాజకీయ ప్రముఖులతో పాటు క్రికెట్ దిగ్గజాలను కూడా పెళ్లికి ఆహ్వానించనున్నారు. అక్కినేని అభిమానులు ఈ వేడుక కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.
ఇదివరకు అఖిల్ ఒక అమ్మాయితో ఎంగేజ్‌మెంట్ చేసుకున్నా, పెళ్లి వరకు వెళ్ళలేదు. పెళ్లికి ముందే వారి సంబంధం ముగిసిపోయింది. కానీ ఇప్పుడు జైనాబ్‌తో ఆయన కొత్త జీవితాన్ని ప్రారంభించేందుకు సిద్ధమవుతున్నారు.
