పెద్దపల్లి మండలం లోని రాఘవాపూర్ రైతు వేదిక లో రైతు నేస్తం – వీడియో కాన్ఫరెన్స్ కార్యక్రమం లో మండలం లోని AEO లందరూ నల్ల బ్యాడ్జీలు ధరించి నేల పై కూర్చొని నిరసన తెలియజేసారు. కేంద్ర ప్రభుత్వ ప్రాజెక్టు అయిన DCS సర్వే మిగితా 11 రాష్ట్రాల ల లోగా మన రాష్ట్రం లో కూడా ప్రైవేటు ఏజెన్సీ కి ఇచ్చి 1000 ఎకరాల కు ఒక వ్యక్తి నీ మించకుండా చేయాల్సి ఉంది, అందుకు గాను ప్రతి ఫారం కు నిధులు కూడా వచ్చాయి , ఇవే నిధులను మిగితా 11 రాష్ట్రాల ప్రైవేటు ఏజెన్సీ లకు ఇచ్చి చెపిస్తున్నాయి . కానీ ఇందుకు భిన్నంగా మన రాష్ట్ర వ్యవసాయ శాఖ లో అగ్రికల్చర్ ప్రిన్సిపాల్ సెక్రటరీ & కమిషనర్ గారు మన రాష్ట్రం లో ఈ పని నీ ఇదివరకే వివిధ పథకాలు , శాఖ పరమైన విధులు నిర్వహిస్తున్న వ్యవసాయ విస్తరణ అధికారులను (AEO)లతో బలవంతంగా చెపించడాన్ని పై అధికారుల , ప్రజా ప్రతినిధుల దృష్టి కి తీసుకెళ్తున్న తరుణం లో ఈ DCS సర్వే కే సంబంధం లేని రైతు భీమా పథకాన్ని బూచి గా పెడుతూ రాష్ట్రం లో అమాయకులైన 165 మంది ని సస్పెండ్ చేయడం జరిగింది. ఇట్టి నకిలీ సస్పెన్షన్స్ ను రద్దు చేయాలి అని బుదవారం (23 అక్టోబర్) నాడు వ్యవసాయ డైరెక్టర్ గారిని కలిస్తే అదే రోజు సాయంత్రం లోగా సస్పెన్షన్ రద్దు చేస్తామని ఇప్పటి వరకు కూడా రద్దు చేయలేదు. అలాగే మన రాష్ట్ర వ్యవసాయ శాఖ కు వచ్చిన అట్టి నిధులు ఏం అయ్యయో కూడా అర్థం కావడం లేదు. ఈ APC గారి నియంతృత్వ ధోరణి నీ నిరసిస్తూ అలాగే వెంటనే సస్పెన్షన్స్ రద్దు చేయాలని నిరసన తెలియజేయడం జరిగింది. మేము ప్రభుత్వానికి వ్యతిరేకం కాదు కేవలం మా పై అధికారుల ధోరణి కే వ్యతిరేకం.
రైతు నేస్తం కార్యక్రమంలో AEO ల నిరసన
 AEOs protested at Raghavapur against arbitrary suspensions and poor management of funds in DCS survey project implementation by the state's agriculture department.
				AEOs protested at Raghavapur against arbitrary suspensions and poor management of funds in DCS survey project implementation by the state's agriculture department.
			
 
				
			 
				
			