నాయుడుపేట డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ గురుకుల బాలుర పాఠశాలలో 2025-26 విద్యా సంవత్సరానికి 5వ తరగతి మరియు ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరంలో ప్రవేశాల కోసం ఆన్లైన్ దరఖాస్తులు ఆహ్వానిస్తున్నామని ప్రిన్సిపాల్ దాదా పీర్ తెలిపారు. 4వ తరగతి, 10వ తరగతి పూర్తిచేసిన విద్యార్థులు ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవచ్చని సూచించారు.
దరఖాస్తు ప్రక్రియ పూర్తిగా ఆన్లైన్లో జరుగుతుందని, అభ్యర్థులు https://apbragcet.apcfss.in/ వెబ్‌సైట్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చని తెలియజేశారు. దరఖాస్తు చివరి తేదీ 06.03.2025 కాగా, విద్యార్థులు సమయానికి అప్లై చేసుకోవాలని కోరారు.
ఈ అవకాశాన్ని ముఖ్యంగా గ్రామీణ ప్రాంత విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలని ప్రిన్సిపాల్ తెలిపారు. విద్యార్థులకు అధునాతన విద్యా సదుపాయాలు, వసతి, భోజనం, ఇతర ప్రయోజనాలు కల్పించనున్నట్లు తెలియజేశారు.
అదనపు సమాచారం కోసం నాయుడుపేట గురుకుల బాలుర పాఠశాల ప్రిన్సిపాల్‌ను సంప్రదించవచ్చని తెలిపారు. ఫోన్ నంబర్లు: 9704550098, 6281042982.

 
				 
				
			 
				
			 
				
			