- దోమల పుట్టకుండా, కుట్టకుండా చర్యలు చేపట్టాలి.
- నీటి నిల్వలు ఎక్కడా ఉండకుండా కృషి చెయ్యాలి.
- ఆడమ్ బి సార్, గాంబియా సోషల్ వర్క్ విద్యార్థిని
దోమల నివారణకు ప్రతి ఒక్కరూ కృషి చెయ్యాలని గాంబియా దేశానికి చెందిన సోషల్ వర్క్ విద్యార్థిని ఆడమ్ బి సార్ పిలుపునిచ్చారు. జిల్లా కలెక్టర్ ఎం ఎన్ హరీంద్ర ప్రసాద్ ఆదేశానుసారం గ్రీన్ క్లైమేట్ టీం వ్యవస్థాపక కార్యదర్శి జెవి రత్నం మద్దిలపాలెం లోని అక్షర ఇంగ్లీష్ మీడియం స్కూల్ లో అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ జాతీయ కీటక జనిత వ్యాధుల నియంత్రణకు ప్రతి ఒక్కరూ సహకరించండి అని కోరారు. మలేరియా, డెంగ్యూ, చికున్ గున్యా , బోద, మెదడు వాపు వ్యాధులను అరికడదాం అన్నారు. ఆనాఫిలస్, క్యూలెక్స్, ఎడిస్ ఆడ దోమల వల్ల మలేరియా, డెంగ్యూ, మెదడువాపు, బోద వ్యాధులు ప్రబలుతాయి అన్నారు. వీటి నివారణకు దోమలు పుట్టకుండా కృషి చెయ్యాలి అన్నారు. మూడు రోజులకు మించి ఎక్కడా మంచి నీళ్ళు నిల్వ ఉండకుండా చూడాలి అని కోరారు. పక్షులు, జంతువులు కోసం నీరు పెట్టె పాత్రలను మూడు రోజులకు ఒకసారి శుబ్రపరిచాలని కోరారు. ఎయిర్ కూలర్, ఫ్రిజ్ నుండి వచ్చే నీళ్ళు ఎప్పటికప్పుడు తొలగించాలని అన్నారు. పాత టైర్లు, తాగి పడవేసె కొబ్బరి బొండాలలో నీరు నిల్వ ఉండకుండా చూడాలి అన్నారు.
ఈ కార్యక్రమంలో గ్రీన్ క్లైమేట్ టీం వ్యవస్థాపక కార్యదర్శి జెవి రత్నం మాట్లాడుతూ దోమల నివారణకు విస్తృతంగా ప్రచారం చెయ్యాలి అని కోరారు. వర్షాల వల్ల నీరు ఎక్కడికక్కడ నిల్వ ఉండకుండా చూసుకోవాలి అని అన్నారు.
ఈ కార్యక్రమంలో విద్యా సంస్థ ప్రిన్సిపాల్ సునీత, ఎయు సోషల్ వర్క్ విద్యార్థినులు బి ఉషారాణి, బి తేజస్విని, బి చైతన్య సరస్వతి పలువురు విద్యార్థులు మాట్లాడారు.