అఖిల భారతీయ విద్యార్థి పరిషత్(ఏబీవీపీ) నెల్లూరు నగర కన్వీనర్ రాజశేఖర్ ఆధ్వర్యంలో స్థానిక అన్నమయ్య సర్కిల్ వద్ద ఇంజనీరింగ్ విద్యార్థులతో కలిసి కూటమి ప్రభుత్వం ఏర్పడి 5 నెలలు గడిచిన విద్యార్థులకు సంబంధించి ఫీజు బకాయిలను ఇంతవరకు చెల్లించలేదని, నారా లోకేష్ పాదయాత్ర సమయంలో విద్యార్థులకు ఇచ్చిన హామీలను ఇంకా నెరవేర్చలేదని, అదేవిధంగా జీవో నెంబర్ 70ను రద్దుచేసి పీజీ చదువుతున్న విద్యార్థులకు కూడా రియంబర్స్మెంట్ చెల్లించాలని, తక్షణమే విద్యార్థులు ఎదుర్కొన్న సమస్యలను పరిష్కరించాలని ప్రభుత్వానికి తమ నిరసన వ్యక్తం చేశారు, లేని యెడల విద్యార్థి శక్తితో పెద్ద ఎత్తున ఉద్యమానికైనా సిద్ధమని ఏబీవీపీ రాష్ట్ర ప్రభుత్వాన్ని హెచ్చరిస్తు, విద్యార్థులకు న్యాయం జరగాలని నిరసన కార్యక్రమం చేపట్టడం జరిగింది.
విద్యార్థుల ఫీజు సమస్యపై ఏబీవీపీ నిరసన
