లారెన్స్ గ్యాంగ్ నుంచి అభినవ్‌కు బెదిరింపులు

Abhinav Shukla revealed he received death threats from Lawrence Bishnoi gang via social media and sought police protection by tagging officials. Abhinav Shukla revealed he received death threats from Lawrence Bishnoi gang via social media and sought police protection by tagging officials.

బాలీవుడ్ నటుడు అభినవ్ శుక్లాకు లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్ తరఫున హత్య బెదిరింపులు రావడం తీవ్ర కలకలం రేపుతోంది. ఇప్పటికే సల్మాన్ ఖాన్‌కు ఈ గ్యాంగ్ నుంచి వరుస బెదిరింపులు వస్తుండగా, తాజాగా అభినవ్ పేరు కూడా బెదిరింపుల్లో చర్చనీయాంశమైంది. ఈ విషయాన్ని స్వయంగా అభినవ్ శుక్లా సోషల్ మీడియాలో వెల్లడించారు. తనకు, తన కుటుంబానికి భద్రత కల్పించాలంటూ పోలీసులను కోరారు.

అభినవ్ తన ఎక్స్ (ట్విటర్) ఖాతాలో ఒక స్క్రీన్‌షాట్ షేర్ చేశాడు. ఆ సందేశంలో ఓ వ్యక్తి “నేను లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్ సభ్యుడిని. సల్మాన్ ఇంటిపై కాల్పులు జరిపినట్లే మీ ఇంటిపైనీ కాల్పులు చేస్తాం. అసిమ్ గురించి గౌరవంగా మాట్లాడండి. లేదంటే జాబితాలో మీ పేరు కూడా చేరుతుంది” అంటూ హెచ్చరించాడని అభినవ్ పేర్కొన్నాడు. ఈ స్క్రీన్‌షాట్‌ను పంజాబ్, చండీగఢ్ పోలీసులకు ట్యాగ్ చేశాడు.

తన కుటుంబ సభ్యులు, భద్రతా సిబ్బంది కూడా బెదిరింపుల బారిన పడుతున్నారని అభినవ్ వాపోయాడు. తనకు వచ్చిన మెసేజ్‌లో ఉన్న వ్యక్తి ఇన్‌స్టాగ్రామ్ ఖాతా వివరాలను కూడా షేర్ చేశాడు. పోలీసులందరి సహకారంతో తన కుటుంబాన్ని కాపాడాలంటూ విజ్ఞప్తి చేశాడు. తనకు ఎదురవుతున్న భయం గల పరిస్థితేంటో అందరికీ చెప్పడానికి ఈ పోస్టు చేశానని స్పష్టం చేశాడు.

ఇటీవల బిగ్‌బాస్ కంటెస్టెంట్స్ అయిన రుబీనా, అసిమ్ మధ్య సుదీర్ఘ వాగ్వాదం జరిగింది. దీనిపై అభినవ్ ఘాటు వ్యాఖ్యలు చేయడంతో అసిమ్ రియాజ్ అభిమానులు అభినవ్‌పై ఆగ్రహంతో బెదిరింపులకు దిగినట్టు తెలుస్తోంది. అభినవ్ చేసిన ఆరోపణల ప్రకారం, ఈ బెదిరింపు అసిమ్ ఫ్యాన్ తరపున వచ్చిందని అనుమానం వ్యక్తం చేశారు. పోలీసులు దీనిపై దర్యాప్తు చేపట్టే అవకాశం ఉంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *