ప్రత్తిపాడు,అక్టోబర్ 5 కాకినాడ జిల్లా ప్రత్తిపాడు మండలం ఉత్తరకంచి ఎస్బిఐ బ్యాంక్ దోపిడీ కేసును చాకచక్యంగా చేధించి సుమారు రెండున్నర కేజీల బంగారం,ఐదు లక్షల రూపాయల నగదు రికవరీ చేసిన అప్పటి కాకినాడ జిల్లా ఎస్పి ఎస్. సతీష్ కుమార్,పెద్దాపురం డిఎస్పి లతా కుమారి,ప్రత్తిపాడు సిఐ ఎం.శేఖర్ బాబు,ప్రత్తిపాడు ఎస్ఐ ఎం.పవన్ కుమార్ మరియు పోలీస్ సిబ్బందికి విధి నిర్వహణలో ఉత్తమ ప్రతిభ కనపరచినందుకు గాను రాష్ట్ర డిజిపి ద్వారక తిరుమల రావు చేతుల మీదుగా బెస్ట్ ఇన్ క్రైమ్ డిటెక్షన్ (ఏబిసిడి) అవార్డు మరియు ప్రశంసా పత్రాలు అందజేశారు.ఈ అవార్డు కోసం రాష్ట్రం మొత్తం మీద క్రైమ్ విభాగం నుండి 27 ఉత్తమ కేసులకి సంబంధించి నామినేట్ చేయగా పలు బృందాలతో మూడు రాష్ట్రాల్లో గాలింపు చర్యలు చేపట్టి ఉత్తరకంచి ఎస్బిఐ బ్యాంక్ దోపిడీ కేసును చేదించిన పోలీస్ అధికారులకి అవార్డు, ప్రశంసా పత్రాలు అందచేశారు.
ఎస్బీఐ దోపిడీ కేసును చేదించిన పోలీసులకి ABCD అవార్డు
 Police officers who solved the Uttarakanchi SBI robbery case, recovering 2.5 kg gold and ₹5 lakh, were awarded by DGP Dwarka Tirumala Rao for their exemplary work.
				Police officers who solved the Uttarakanchi SBI robbery case, recovering 2.5 kg gold and ₹5 lakh, were awarded by DGP Dwarka Tirumala Rao for their exemplary work.
			
 
				
			 
				
			 
				
			