భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ములకలపల్లి మండలం మూకమామిడి గ్రామంలో విషాదం చోటుచేసుకుంది.. భర్త,అత్తింటి వారి వేధింపుల తాళలేక కలుపు మందు తాగి ఓ వివాహిత ఆత్మహత్యాకు పాల్పడింది..
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ములకలపల్లి మండలం మూకమామిడి గ్రామానికి చెందిన భూక్యా రేణుక కు, టేకులపల్లి మండలం దంతాల తండా కు చెందిన భూక్య బాబూలాల్ కు 2022లో వివాహమైంది…
రెండేళ్లు కావోస్తున్న రేణుక గర్భం దాల్చకపోవడంతో అత్తింటి వారు వేధింపులకు దిగారు..నువ్వు గోడ్రాలివి,మా కుమారుడికి నువ్వు విడాకులు ఇస్తే మేము వేరొక అమ్మాయిని ఇచ్చి వివాహం చేస్తామంటూ రేణుక పై ఆడిపోసుకుంటూ వచ్చారు… అండగా ఉండాల్సిన భర్త సైతం భార్య రేణుక విడాకులు ఇస్తే సరే, లేదంటే రేణుక చెల్లి కళ్యాణి ని ఇచ్చి వివాహం చేయాలంటూ రేణుకుపై ఒత్తిడి పెంచసాగాడు..
దీంతో తరచూ ఇంట్లో రేణుకాకు, భర్త అత్తమామలతో గొడవలు జరుగుతున్నాయి.. ఇటీవల భర్త తీరుతో తీవ్ర మనస్థాపానికి గురైన రేణుక ములకలపల్లి మండలం మూకమాామిడి గ్రామంలోని పుట్టింటికి చేరింది…
తల్లి దగ్గరే ఒంటరిగా ఉండటం, భర్తతో గొడవలు, గొడ్రాలనే నిందలు రేణుకను మానసికంగా కృంగదీశాయి.. దీంతో ఈ గత నెల 27న కలుపుమందు తాగి రేణుక ఆత్మహత్యయత్నానికి ఒడిగట్టింది…
గమనించిన కుటుంబ సభ్యులు ముందుగా పాల్వంచలోని ఓ ప్రాథమిక హాస్పిటల్లో ప్రాథమిక చికిత్స చేయించగా, పరిస్థితి విషమించడంతో ఖమ్మంలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చేర్పించారు.చికిత్స పొందుతూ రేణుక గురువారం సాయంత్రం తుది శ్వాస విడిచింది…
భార్య చావు బ్రతుకుల మధ్య వారం రోజులు పోరాడినప్పటికి భర్త బాబులల్ కనీసం ఆసుపత్రికి కూడా రాలేదంటూ రేణుక కుటుంబ సభ్యులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు..
రేణుక చనిపోతూ తన చావుకి భర్త బాబూలాల్ తోపాటు భర్త తరుపు కుటుంబ సభ్యులు కారణమని మరణవాగ్మూలం ఇచ్చింది..
రేణుక తల్లి ఫిర్యాదు మేరకు,రేణుక మరణ వాంగ్మూలం ఆధారంగా భర్త బాబులాల్,అత్తింటి కుటుంబ సభ్యులపై పోలీసులు కేసు నమోదు చేసుకొని విచారణ చేపట్టారు.
