విజయనగరం జిల్లా మెంటాడ మండలం చల్లపేట గ్రామంలో కార్తిక సోమవారం సందర్భంగా ద్వాదశ జ్యోతిర్లింగాల ఆరాధన ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. సోమవారం రాత్రి ఓం శాంతి భక్త బృందం నిర్వహించిన ఈ కార్యక్రమంలో జ్యోతిర్లింగాల రూపకల్పన భక్తులను ఆధ్యాత్మికంగా ఆకర్షించింది. వివిధ గ్రామాల నుండి పెద్ద సంఖ్యలో భక్తులు హాజరై జ్యోతిర్లింగాలను దర్శించుకుని దీపారాధనలో పాల్గొన్నారు.
కార్తిక మాసంలో శివుని ఆరాధన విశేషమైన ఫలితాలను ఇస్తుందని నిర్వాహకులు తెలియజేశారు. పరమశివుడు జ్యోతి స్వరూపుడని, దీపారాధన చేయడం ద్వారా సకల సమస్యలు తొలగిపోతాయని తెలిపారు. కార్తిక మాసంలో దీపారాధన చేయడం ఆయురారోగ్యాలను కలిగించి, భక్తులకు శాంతి ప్రసాదిస్తుందని పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో మాజీ కో ఆపరేటివ్ బ్యాంక్ అధ్యక్షులు రామచంద్రరావు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. గజపతినగరం బ్రహ్మకుమారీస్ ఇంచార్జ్ బికె స్వాతి, బికె సత్యవతి, బికె సత్యారావు, బికె వర్మ తదితరులు సైతం పాల్గొని శివపూజలో పాల్గొన్నారు. జ్యోతిర్లింగాల ప్రత్యేక ఆరాధనకు హాజరైన భక్తులు.