కొల్చారం మండలం రాంపూర్ గ్రామంలో మంజీరా మెటల్ ఇండస్ట్రీ అక్రమ బ్లాస్టింగ్ పై మైనింగ్ అధికారులు చర్యలు తీసుకోవాలని కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షులు జంగిటి నాగరాజు డిమాండ్ చేశారు. రాంపూర్ గ్రామంలోని మెటల్ ఇండస్ట్రీ వద్ద కంకర తరలిస్తున్న లారీలను సోమవారం గ్రామస్తులతో కలిసి నాయకుల అడ్డుకున్నారు. 22 సంవత్సరాల క్రితం అనుమతి తీసుకున్న క్వారీ కాలం పూర్తయినందున అధికారులు చర్యలు తీసుకోవాలని క్వారీ లిజ్ అనుమతి రద్దు చేయాలని వారు డిమాండ్ చేశారు. అక్రమంగా బ్లాస్టింగ్ ల వల్ల ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, రాళ్లు ఎగిరిపడి పంట పొలాల్లో పడడం వల్ల రైతులు నష్టపోతున్నారని, గ్రామంలోని ఇళ్లకు బీటలు వారి నష్టపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు ఇప్పటికైనా అధికారులు స్పందించి అక్రమ బ్లాస్టింగ్ నిలిపివేసింది అనుమతులు రద్దు చేయాలని డిమాండ్ చేశారు.
రాంపూర్ గ్రామంలో అక్రమ బ్లాస్టింగ్ ఆపాలని డిమాండ్
 Congress leader Jangiti Nagaraju demands action against illegal blasting in Manjeera Metal Industry. Villagers protest over damages to crops and houses.
				Congress leader Jangiti Nagaraju demands action against illegal blasting in Manjeera Metal Industry. Villagers protest over damages to crops and houses.
			
 
				
			 
				
			 
				
			