జనగామ జిల్లా పాలకుర్తి మండల కేంద్రంలో గల సామాజిక ఆరోగ్య కేంద్రంలో డాక్టర్ల కరువు ఉదయం పది దాటిన ప్రభుత్వ ఆసుపత్రికి రాని సామాజిక ఆరోగ్య కేంద్రం డాక్టర్లు. డాక్టర్లు లేక రోగులు ఇబ్బంది పడుతున్నరు.24 గంటలు ఉండాల్సిన సిహెచ్ సి డాక్టర్లు వారానికి రెండు రోజులే డ్యూటీ చేస్తూ మిగతా రోజులు డుమ్మా కొడుతున్నారు.
డాక్టర్లు ఆలస్యంగా వచ్చి తొందరగా వెళ్ళిపోతున్నారు. మధ్యాహ్నం 12 గంటలు దాటితే ఓపి మూసివేస్తున్నరు. మధ్యాహ్నం12 గంటల తర్వాత వచ్చిన పేషెంట్ల పరిస్థితి అయోమయంగా మారుతుంది. ప్రభుత్వ ఆసుపత్రిని పట్టించుకునే వారే లేరని రోగుల ఆవేదన చెందుతున్నారు.అందుబాటులో లేని సామాజిక ఆరోగ్య కేంద్ర సూపరింటెండెంట్ డ్యూటీ చేసే రోజు 11 గంటల వరకు వచ్చి మద్యాహ్నం వరకు వెళ్లి పోతుంది. సూపరింటెండెంట్ చెప్పినట్టు వినక పోతే సూపరింటెండెంట్ పూనకం వచ్చినట్లే సిబ్బంది పై తన కోపాన్ని తీర్చుకుంటుంది..