రామగుండం నియోజకవర్గాన్ని బొంద ల గడ్డగా మార్చిన కొప్పుల ఈశ్వర్ కొరుకంటి చందర్ కు మాట్లాడే నైతిక హక్కు లేదు. రామగుండం నియోజకవర్గ అభివృద్ధికి 300 కోట్లు నిధులు,నియోజకవర్గంలోని పరిశ్రమలు సింగరేణి, ఎన్టీపీసీ,ఆర్ ఎఫ్ సి ఎల్ మరియు సి ఎస్ ఆర్ నిధులను నియోజకవర్గానికె కేటాయించెల చెసిన ఘనత ఎమ్మెల్యే మక్కాన్ సింగ్ రాజ్ ఠాకూర్. గత ప్రభుత్వంలో రూపాయి కూడా రామగుండం నియోజకవర్గానికి తీసుకురాలేని కొప్పుల ఈశ్వర్ మీకు మాట్లాడే నైతిక హక్కు లేదు. మాజీ శాసనసభ్యులు కోరుకుంటీ చందర్ ఉద్యోగాల పేరిట ఆర్ ఎఫ్ సి ఎల్ లో లక్షల రూపాయలు వసూలు చేస్తే అప్పుడు ఎక్కడికి వెళ్లావు కొప్పుల ఈశ్వర్ నిరుపేద కుటుంబాలు గుర్తుకు రాలేదా.
అని ఎమ్మెల్యే క్యాంఊ కార్యాలయం ఆవరణలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వెల్లడించిన కార్పొరేటర్ మహంకాళి స్వామి. గోదావరిఖనిలో పుట్టి పెరిగి మంత్రిగా చేసిన ఈశ్వర్ గత 20యెళ్ళలో ఏ ఒక్క రోజైనా రామగుండం నియోజకవర్గ అభివృద్ధి కోసం కనీసం ఆలోచన చేసిన పాపాన పోలేదని విమర్శించిన మహంకాళి స్వామి. గత పదేళ్ల ప్రభుత్వంలో మంత్రిగా ఉన్నప్పుడు నియోజకవర్గానికి రూపాయి పని చేసినవా అంటూ ప్రశ్నించారు. గోదావరిఖని, రామగుండం నియోజకవర్గం గురించి మాట్లాడే నైతిక హక్కు నీకు ఉందా అంటూ ఎద్దేవా చేశారు. గత పది సంవత్సరాల కాలంలో ఒక ధర్నా, రాస్తారోకో కానీ చేయనిచ్చారా హౌస్ అరెస్టులు చేపించి స్వేచ్ఛను హరించింది వాసం కాదా అని గుర్తు చేశారు. ఆర్ ఎఫ్ సి ఎల్ లో ఉద్యోగాల పేరిట వసూలు చేసినప్పుడు బాధితులు ఆత్మహత్యలకు పాల్పడినప్పుడు ఏడ పోయిన అప్పుడు కనపడలేదా అరాచక పాలన, మాజీ ఎమ్మెల్యే కోరుగంటి చందర్ ఆర్ ఎఫ్ సి ఎల్ లో ఉద్యోగాల పేరిట మోసం చేస్తే బాధితులు ఆత్మహత్య చేసుకొని చనిపోయినప్పుడు బాధితుల తరఫున నిలబడకపోగా ఏ ఒక్క రోజైనా వాళ్ళ తరఫున ఎవరు ఆత్మహత్యలకు పాల్పడవద్దని నేనున్నానంటూ భరోసా కల్పిస్తూ ఏనాడైనా మీడియా సమావేశం నిర్వహించినవా ఆత్మహత్యలకు పాల్పడి చనిపోయిన వారి కుటుంబాలను ఏనాడైనా పరమార్శించావా.
ఈరోజు రామగుండం నియోజకవర్గ అభివృద్ధి ధ్యేయంగా 300 కోట్లు నిధులను తీసుకురావడమె కాకుండా పరిశ్రమల ద్వారా నియోజకవర్గానికి నిధులు కేటాయించాలని అభివృద్ధిలో భాగస్వాములు కావాలని కొట్లాడి నిదులను కేటాయించేలా చేసిన ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ మీద బురదజల్లే ప్రయత్నం మానుకోవాలని అది ప్రజలు గమనిస్తూనే ఉన్నారని సింగరేణి స్థలాలను కబ్జాలు చేయాలని చూసింది మీ టిఆర్ఎస్ నాయకులు అని వారి పాలు కాకుండా ఉపాధి శిక్షణ కేంద్రంగా మార్చడమె కాకుండా ఓల్డ్ అశోక్ థియేటర్ స్థలంను కబ్జాకోర్లకు దక్కకుండా చేసింది కూడా రామగుండం ఎమ్మెల్యే అని పట్టణ సుందరికరణలో భాగంగా పట్టణాన్ని సుందరికరించడం, నియోజకవర్గ అభివృద్ధి దిశగా ప్రయాణిస్తున్న ఎమ్మెల్యే గారికి నియోజకవర్గ ప్రజలందరూ సహకరిస్తున్నారని ఉనికి కాపాడుకునే మీకేం అర్థం అవుతుందని మీ బిఆర్ఎస్ లో అంతర్గత వర్గ పోరు, ఇద్దరు పోయి మూడోగడు వచ్చిండు ఎన్నారైని అనుకుంటూ సోషల్ మీడియాలో నియోజకవర్గంలో అభివృద్ధి జరగట్లేదని, ప్రజలను తప్పుదోవ పట్టించాలని, ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ గారి పై విష ప్రచారం చేస్తున్న ఎన్ఆర్ఐ బిడ్డ ఇష్టానుసారంగా వ్యవహరిస్తూ ఇంకోసారి అవస్తవాలను ప్రచారం చేయడం పునరావృతం అయితే ఊరుకోమంటు హెచ్చరించిన కాంగ్రెస్ నాయకులు. ఈ ప్రెస్ మీట్ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు కార్పొరేటర్లు మాజీ కార్పొరేటర్లు వివిధ విభాగాల అధ్యక్షులు తదితరులు ఉన్నారు.