అల్లూరి జిల్లా దేవీపట్నం మండలంలో ప్రభుత్వం ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని రంపచోడవరం సబ్ కలెక్టర్ కల్పశ్రీ ప్రారంభించారు. ఈ సందర్భంగా రైతులతో మాట్లాడి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. రైతుల సమస్యలు పరిష్కరించడానికి ప్రభుత్వం విశేష కృషి చేస్తోందని తెలిపారు.
ఆమె మాట్లాడుతూ, రైతులకు మెరుగైన మద్దతు ధరను ప్రభుత్వం ప్రకటించిందని, నిర్దేశించిన ధర ప్రకారమే ధాన్యం కొనుగోలు జరుగుతుందని వివరించారు. వాతావరణ మార్పులు కారణంగా రైతులు ఇబ్బందులు పడకుండా ఈ కేంద్రాలను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.
ప్రభుత్వం 75 కేజీల ధాన్యానికి రూ. 1,725, వంద కేజీల ధాన్యానికి రూ. 2,300 మద్దతు ధరగా నిర్ణయించినట్లు తెలిపారు. కొనుగోలు చేసిన 48 గంటల్లోనే రైతులకు డబ్బులు చెల్లిస్తామని హామీ ఇచ్చారు. రైతులు దళారులను నమ్మి తక్కువ ధరకు ధాన్యం అమ్మకూడదని స్పష్టం చేశారు. వ్యవసాయ శాఖ మరియు ప్రభుత్వ ప్రోత్సాహంతో పంటల విక్రయం సజావుగా సాగుతుందని తెలిపారు.

 
				 
				
			 
				
			 
				
			