విద్యార్ధులు, యువతను సన్మార్గంలో నడిపి, వారిలో వ్యక్తిత్వవికాసం, కమ్యూనికేషన్ స్కిల్స్ మెరుగు పర్చి, ఉన్నత లక్ష్యాలను సాధింప జేసేందుకు జిల్లా ఎస్పీ శ్రీ తుహిన్ సిన్హా గారు నర్సీపట్నం టౌన్ పోలీస్ ల ఆధ్వర్యంలో
డిగ్రీ కాలేజీ విద్యార్థులకు సంకల్పం కార్యక్రమంలో భాగంగా అవగాహన కార్యక్రమం నిర్వహించారు.
ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ తుహిన్ సిన్హా ఐపిఎస్ మాట్లాడుతూ నేడు సమాజం ఎదుర్కొంటున్న సమస్యల్లో యువత మాదక ద్రవ్యాలకు బానిసలుగా మారడమన్నది ప్రధాన సమస్యగా మారిందన్నారు. మాదక ద్రవ్యాల వినియోగం వలన యువత ఏవిధంగా చెడిపోతున్నారో వివరించి, వారిని తిరిగి సన్మార్గంలో నడిపేందుకు జిల్లా పోలీసుశాఖ “సంకల్పం” అనే కార్యక్రమాన్ని చేపట్టిందన్నారు.
మాదక ద్రవ్యాల వినియోగం యువతపై ఏవిధంగా చెడు ప్రభావాన్ని చూపిస్తున్నది. వారి జీవితాలను, కుటుంబాలను ఏవిధంగా అస్తవ్యస్తం చేస్తున్నదన్న విషయాలు సులువుగా అర్ధమయ్యే విధంగా పోస్టర్లు, పాంప్లెట్లు మరియు బ్యానర్లు సంబంధిత స్కూల్ మరియు కాలేజీ ఆవరణలో ఏర్పాటు చేయడం జరిగిందన్నారు.
చిన్న చిన్న వీడియోలను ప్రదర్శించారు. అదే విధంగా మత్తు పదార్థాలు వలన యువత శరీరం, నాడీ వ్యవస్థపై దుష్ప్రభావాన్ని ఏవిధంగా చేస్తుందో పవర్ పాయింట్ ప్రజెంటేషనుతో వివరించి, యువతలో చైతన్యం తీసుకొని వచ్చేందుకు విద్యార్థులతో ప్రతిజ్ఞ చేయించడం జరిగిందన్నారు.
