లోకం మాధవిని ప్రశ్నించిన రఘురాజు, నవ్వులతో సమాధానం

In the AP Assembly, MLA Lokam Madhavi raised concerns about handloom workers' issues. Deputy Speaker Raghuraju asked her if she was wearing a handloom saree In the AP Assembly, MLA Lokam Madhavi raised concerns about handloom workers' issues. Deputy Speaker Raghuraju asked her if she was wearing a handloom saree

చేనేత సమస్యలపై మాట్లాడిన లోకం మాధవి

మీరు కట్టుకున్నది చేనేత చీరేనా అని ప్రశ్నించిన రఘురాజు

నవ్వుతూ సమాధానమిచ్చిన మాధవి

ఏపీ అసెంబ్లీ సమావేశాలు చమత్కారాలు, ఆసక్తికర సన్నివేశాలతో కొనసాగుతున్నాయి. అలాంటి సన్నివేశమే మరొకటి ఈరోజు అసెంబ్లీలో చోటుచేసుకుంది. ఈరోజు అసెంబ్లీ సమావేశాలు మొదలయిన వెంటనే డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు ప్రశ్నోత్తరాలను చేపట్టారు. సభ్యులు అడిగిన ప్రశ్నలకు మంత్రులు సమాధానాలు ఇస్తున్నారు.

ఈ క్రమంలో చేనేత సమస్యలపై జనసేన ఎమ్మెల్యే లోకం మాధవి మాట్లాడుతూ… చేనేత కార్మికుల సమస్యలను లేవనెత్తారు. అనంతరం రఘురాజు మాట్లాడుతూ లోకం మాధవి మాట్లాడిన తీరును అభినందించారు. చేనేత సమస్యలను చక్కగా వివరించారని అన్నారు. ప్రభుత్వ ఉద్యోగులు నెలకు ఒక రోజు చేనేత వస్త్రాలను ధరించేలా ప్రభుత్వం ఏమైనా చర్యలు తీసుకుంటుందా? అని మాధవి ప్రశ్నించగా… ఇంతకీ మీరు ధరించింది చేనేత చీరనా? లేక వేరే చీరనా? అని రఘురాజు ప్రశ్నించారు. తాను చేనేత చీరను ధరించానని ఆమె నవ్వుతూ సమాధానమిచ్చారు. దీంతో సభలో నవ్వులు విరబూశాయి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *