పార్వతీపురం మన్యం జిల్లా కురుపాం రావాడ రోడ్డు సమీపంలో ఉన్న వరుణ్ మారుతి షోరూమ్ లో మేనేజర్ రమేష్ ఆధ్వర్యంలో సోమవారం సాయంత్రం న్యూ వెర్షన్ డిజైర్ కారును ఎల్విన్ పేట సీఐ హరి, కేక్ కట్ చేసి ప్రారంభించారు. ఈ సందర్బంగా సీఐ హరి మాట్లాడుతూ ఇప్పటి వరకు వరుణ్ మారుతి షోరూం ప్రైవేట్ లిమిటెడ్ యాజమాన్యం ఎన్నో అద్భుతమైన కారులు రిలీజ్ చేసి కస్టమర్లకు అమ్మడం జరిగిందన్నారు. నూతన వెర్షన్ కారు అద్భుతం గా ఉండటం చాలా సంతోషంగా ఉందన్నారు.
న్యూ వెర్షన్ డిజైర్ కారు కస్టమర్లు కొనుకొని సద్వినియోగం చేసుకోవాలని సీఐ హరి ప్రజలను కోరారు. ఈ కార్యక్రమంలో కురుపాం ఎస్ ఐ నారాయణ రావు,కళింగ వైశ్య సంఘం జిల్లా అధ్యక్షులు అందవరపు కోటేశ్వరరావు, టిడిపి తెలుగు యువత రాష్ట్ర అధికార ప్రతినిధి కోలా రంజిత్ కుమార్, ఉప సర్పంచ్ షేక్ ఆదిల్, కొత్తకోట రవేంద్ర కుమార్, తదితరులు పాల్గొన్నారు.

 
				 
				
			 
				
			 
				
			