యుగందర్ కల్చరల్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఢిల్లీ ఏపీ భవన్ అంబేద్కర్ ఆడిటోరియంలో 6వ నేషనల్ డాన్స్ పోటీలు ఘనంగా నిర్వహించారు. ఈ పోటీలకు వివిధ రాష్ట్రాల నుంచి 100 మంది చిన్నారులు హాజరయ్యారని ఆర్గనైజర్ సుమలత తెలిపారు. ఈ కార్యక్రమానికి తెలుగు రాష్ట్రాల ఎంపీలు రఘనందన్ రావు, లావు కృష్ణదేవరాయలు, రెహమాన్‌లు తమ సహకారాన్ని అందించారని ఆమె పేర్కొన్నారు. వారి సహకారం వల్ల ఈ కార్యక్రమం విజయవంతంగా పూర్తయిందని ఆమె ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలిపారు. పోటీల్లో చిన్నారులు చూపించిన ప్రతిభ అందరిని ఆకట్టుకుంది. న్యాయనిర్ణేతల తీర్పు ప్రకారం విజేతలను ప్రకటించారు. గెలుపొందిన వారికి ముఖ్య అతిథి చేతుల మీదుగా బహుమతులు అందజేశారు. ఈ పోటీలు చిన్నారుల్లో సృజనాత్మకతను పెంపొందించడంలో స్ఫూర్తిగా నిలుస్తాయని సుమలత తెలిపారు. ఈ కార్యక్రమం విజయం సాధించడంలో సహకరించిన ప్రతి ఒక్కరికి ఆమె కృతజ్ఞతలు తెలిపారు.
ఢిల్లీ ఏపీ భవన్‌లో నేషన్‌ల్ డాన్స్ పోటీలు
