సుకుమార్ దర్శకత్వంలో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, నేషనల్ క్రష్ రష్మిక మందన్న జంటగా నటించిన ‘పుష్ప-2 ది రూల్’ మూవీ డిసెంబర్ 5న ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఈ సినిమాకు సంబంధించిన ట్రైలర్ లాంచ్ ఈవెంట్‌ను ఆదివారం సాయంత్రం పాట్నాలో గ్రాండ్‌గా నిర్వహించారు.
సాయంత్రం 6.03 గంటలకు విడుదల చేసిన ఈ ట్రైలర్‌కి ప్రేక్షకుల నుండి అద్భుతమైన స్పందన వస్తోంది. సినిమా అంచనాలు మరింత పెంచిన ఈ ట్రైలర్‌ను చూసి అభిమానులు ఉర్రూతలూగిపోతున్నారు.
దర్శకధీరుడు రాజమౌళి కూడా పుష్ప-2 ట్రైలర్‌పై స్పందించారు. ‘‘పాట్నాలో వైల్డ్ ఫైర్ మొదలైంది!! దేశమంతటా విస్తరిస్తోంది!! డిసెంబర్ 5న పేలుతుంది!!’’ అంటూ ఆయన ట్విట్టర్ వేదికగా స్పందించారు.
‘పుష్ప అంటే నేషనల్ అనుకుంటిరా… ఇంటర్నేషనలు…!’ మరియు ‘పుష్ప అంటే ఫైరు కాదు… వైల్డ్ ఫైర్’ వంటి డైలాగులతో ఈ ట్రైలర్ ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది. 2021లో విడుదలై విజయాన్ని సాధించిన పుష్ప సినిమాకు ఇది సీక్వెల్.