ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను అమలు చేయలేక, డైవర్షన్ పాలిటిక్స్ తో నెట్టుకొస్తున్నారని వైసీపీ నాయకురాలు, మాజీ మంత్రి రోజా కూటమి ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. వైసీపీకి చెందిన మహిళలపై నీచంగా పోస్టులు పెడుతున్నారని, సోషల్ మీడియాలో అసభ్యకరమైన పోస్టులు పెట్టిన కూటమి కార్యకర్తలపై చర్యలు తీసుకోవాలని రోజా కోరారు. తప్పు చేస్తే వైసీపీ కార్యర్తలపై కేసులు పెట్టాలని, దొంగ కేసులు పెడితే తాము ఊరుకునేది లేదని, పోలీసులకు టోపీపై ఉన్న మూడు సింహాలకు సెల్యూట్ చేసేలా ప్రవర్తించాలని హితవు పలికారు. చంద్రబాబుకు ఎదుటి వారిపై బురద చల్లడం, వ్యక్తిత్వ హననం చేయడం అలవాటే అని, వైసీపీ నేతలపై దాడులు చేయడానికి పోలీసులను ఉపయోగించడం ప్రస్తావిస్తూ తిరుగుబాటు తప్పదని హెచ్చరించారు.
రోజా విమర్శలు… కూటమి ప్రభుత్వంపై ఆగ్రహం
YCP leader Roja criticized the alliance government for failing to fulfill election promises and indulging in diversionary politics. She demanded action against those spreading offensive posts about YCP leaders.
