పాలకొండ నగర పంచాయతీ కార్యాలయం వద్ద భారత కమ్యూనిస్టు పార్టీ సిపిఐ ఆధ్వర్యంలో పట్నాల్లో రెండు సెంట్లు ఇళ్ల స్థలం పేదలకు ఇవ్వాలని, ఇంటి నిర్మాణానికి ఐదు లక్షలు ఇవ్వాలని సిపిఐ ఆధ్వర్యంలో ధర్నా జరిగింది. ఈ సందర్భంగా నియోజకవర్గ కార్యదర్శి బుడితి అప్పలనాయుడు మాట్లాడుతూ జగనన్న కాలనీలో కనీస సదుపాయాలు కల్పించాలని,త్రాగునీటి సమస్య తక్షణమే పరిష్కరించాలని మరియు పట్టణంలో పేదలకు రెండు సెంట్లు, పల్లెల్లో మూడు సెంటు ఇవ్వాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
స్థానిక కార్యాలయం వద్ద జరుగుతున్న ధర్నా సమయంలో తెలుగుదేశం పార్టీ అరకు పార్లమెంట్ ఉపాధ్యక్షులు సీనియర్ నాయకులు పల్లా కొండలరావు కు బాధితులు సమస్యను వివరించగా తక్షణమే స్పందించి రోజుకు రెండు ట్యాంకల నీరు ఇచ్చుటకు మరియు స్థానిక విద్యుత్ శాఖ అధికారులు పిలిపించి రాత్రి వేళల్లో కరెంటు సమస్య వస్తే తక్షణమే స్పందించి విద్యుత్తు సరఫరా ఎటువంటి ఆటం లేకుండా చూడాలని తెలుపుతూ లబ్ధిదారులకు హామీ త్రాగునీటి సమస్యపై భవిష్యత్తులో ఉత్పన్నమయ్యే అంశం మీద సంబంధిత ఉన్నతాధికారుల దృష్టికి కూడా తీసుకెళ్తామని తెలిపారు.
ఈ సందర్భంగా నియోజకవర్గం కార్యదర్శి బుడితి అప్పలనాయుడు మాట్లాడుతూ గత ప్రభుత్వం పాలకొండ పట్టణంలో సుమరు పంతొమ్మిది వందల మంది పేదలకు లుంబూరు వెళ్ళు దారిలో ఇళ్ల స్థలాల కోసం భూసేకరణ చేసింది. ఆ సందర్భంలో ఉన్న అధికారులు భూగర్భ జలాల స్థితిగతులు గాని, త్రాగు నీటి ప్రజా అవసరాలు గాని గుర్తించకుండా జగనన్న ఇల్ల స్థలాల సముదాయానికి భూ సేకరణ జరిపారని ప్రధానంగా త్రాగునీటి సమస్యను పరిగణలోకి తీసుకుపోవడంతో ఆనాడు లబ్ధిదారులతో బలవంతంగా ఇల్లు కట్టించారని వారు నేడు చాలా ఇబ్బందులకు గురి అవవలసి వస్తుందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.
విద్యుత్ బల్బులు పాడైపోతే కొత్తగా ఏర్పాటు చేయుటకు కాంట్రాక్టర్కు మున్సిపాలిటీ వారికి మధ్య ఎటువంటి అనుసంధానం జరగలేదని దీనివల్ల సమస్య పరిష్కారం కాక చీకట్లో విష తులిత పాములు పురుగుల మధ్య పునాదులు వేసి ఇల్లు కట్టక తుప్పలు డొంకల తో ఉన్న స్థలం మధ్య నివాసం చేయడం చాలా కష్టంగా ఉందని కావున తక్షణమే స్పందించి వారి మౌలిక సదుపాయాలు తీర్చాలని పట్టణ నగర పంచాయతీ కమిషనర్ గారికి విజ్ఞాపన చేయడం జరిగింది. సమస్య శాశ్వత పరిష్కారానికి నిపుణులతో చర్చించి తగు చర్యలు తీసుకోవాలని కోరడమైనది. ఈ కార్యక్రమంలో పి. తవిటి రాజు, సిహెచ్ కృష్ణకుమారి పద్మావతి లక్ష్మీ కె రాజు డి నాగమ్మ షేక్ అబ్దుల్ తదితరులు పాల్గొన్నారు.