మై స్కూల్ – మై ప్రైడ్ లో భాగంగా ప్రభుత్వ వసతి గృహాల్లోని 10వ తరగతి విద్యార్థులకు ఈ నెల 22న ప్రతిభ పరీక్షను నిర్వహించాలని జిల్లా కలెక్టర్ ఎ.శ్యామ్ ప్రసాద్ తెలిపారు. గురువారం కలెక్టరేట్ వీడియో సమావేశ మందిరం నుంచి ఎంఈఓలు, తహసీల్దార్లతో కలెక్టర్ సమీక్షించారు. ఈ సందర్బంగా కలెక్టర్ మాట్లాడుతూ గతంలో మాదిరి కాకుండా, ఈసారి ఆంగ్ల భాషలో పది పరీక్షలు రాయాల్సి ఉంటుందని అన్నారు. తెలుగు, హిందీ మినహా మిగిలిన అన్ని పరీక్షలు ఆంగ్లంలో రాయాల్సి ఉందని తెలిపారు. అందువలన మండల ప్రత్యేక అధికారులు పల్లె నిద్రలో భాగంగా శుక్రవారం ఈ ప్రతిభ పరీక్షను నిర్వహించి, పర్యవేక్షించాలని కలెక్టర్ ఆదేశించారు. ఈ పరీక్ష ద్వారా విద్యార్థుల్లో ఉండే ప్రతిభను గుర్తించవచ్చని, తద్వారా వెనుకబడిన విద్యార్థులను గుర్తించి, వారికి ప్రత్యేక తరగతులను నిర్వహించేందుకు అవకాశం కలుగుతుందని అన్నారు.
ప్రతిభ పరీక్షలు నిర్వహణకు కలెక్టర్ ఆదేశాలు
