విజయనగరం జిల్లా మెంటాడ ఎంపీడీవో కార్యాలయ సమావేశ భవనంలో గురువారం డాక్టర్ మైఖేల్ సుకుమార్ కుష్టు వ్యాధి పై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. సందర్బంగా అయన మాటలు ఆడుతూ గ్రామాలలో కుష్టు వ్యాధిపై దాని ప్రభావాలకు సంబంధించిన మైక్రో బ్యాక్టీరియ లెప్రా పర్యావరణ సానిథ్యంపై సమగ్ర పరిశోధనలు చేస్తున్నట్లు తెలిపారు. పరిశోధనలో భాగంగా పలు పంచాయతీల పరిధిలో గృహ సర్వే, నేల మరియు నీటి నమూనాలు ( త్రాగునీరు, మురుగునీరు సేకరణ అలాగే పశువులలో మైక్రో బ్యాక్టీరియా స్క్రీనింగ్ చేయటం జరుతుంది అని దీనికి గ్రామంలో ఈ సర్వే కొరకు సి ర్ పిఎస్ షగ్ గ్రూప్ సభ్యులు కు 3 రోజులు శిక్షణ ఇవ్వటం జరుగుతుంది అని తెలిపారు.
ఈ పరిశోధన లెఫ్రా సొసైటీ బ్లూ పీటర్ పబ్లిక్ హెల్త్ మరియు రీసెర్చ్ సెంటర్ (BPHRC), హైదరాబాద్ తెలంగాణ నుండి ప్రిన్సిపల్ ఇన్వెస్టిగేటర్ డాక్టర్ అపర్ణ శ్రీకాంతంఆధ్వర్యంలో జరుపబడునుఅని డాక్టర్ మైకెల్ తెలిపారు. ముఖ్య అతిది మండల అధికారి భానుముర్తి మాట్లడుతూ లెప్రా చేస్తున్న సర్వే సీపీ, ఎస్ హెచ్ జి లు పూర్తి సహాయ సహకారులు అందంచాలి అని, గ్రామ అధికారులు అండ్ గ్రామ ప్రతినిధులు నుండి సహాయం అందే విదంగా చూస్తాను అని తెలిపారు. మెంటాడ మండలం లో కుష్ఠు వ్యాధిని నిర్ములిలించాలని తెలిపారు. ఈ కార్యక్రమం లోమెంటాడ పీహెచ్ వైద్యధికారి డాక్టర్ లోక ప్రియా, డాక్టర్ రావి చతుర్య, రీసెర్చ్ అసోసియేట్, పల్లివి మొరే, రీసెర్చ్ అసిస్టెంట్, లెంక రమణ, ఫీల్డ్ ఇన్వెస్టగేటర్ పాల్గున్నారు.
మెంటాడలో కుష్ఠు వ్యాధిపై అవగాహన, సర్వే కార్యక్రమం
