బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్‌కు మరోసారి బెదిరింపులు వచ్చాయి. ఈసారి లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్ పేరును ప్రస్తావిస్తూ సల్మాన్‌కి బెదిరింపు సమాచారం చేరిందని ముంబయి పోలీసులు వెల్లడించారు. గురువారం అర్ధరాత్రి గుర్తు తెలియని వ్యక్తులు ముంబయి ట్రాఫిక్ కంట్రోల్ రూమ్‌కు ఫోన్ చేసి సల్మాన్‌ను హెచ్చరించినట్లు అధికారులు చెప్పారు. ఈ ఫోన్‌కాల్‌లో ఒక పాట రచయితకు ఒక నెలలో తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాలని, సల్మాన్‌కి ధైర్యం ఉంటే రక్షించుకోవాలని హెచ్చరించినట్లు పోలీసులు తెలిపారు.
సల్మాన్‌కు ఇటీవల తరుచూ ఇలాంటి బెదిరింపు కాల్స్ రావడం పెరిగింది. గతంలో కూడా లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్ నుంచి హెచ్చరికలు వచ్చిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే కర్ణాటకలోని హవేరిలో, రాజస్థాన్‌లో పలువురిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అయితే ఈ బెదిరింపులపై పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేస్తున్నారు.
ఇదే తరహాలో బాలీవుడ్ బాద్‌షా షారుఖ్ ఖాన్ కూడా ఇటీవల బెదిరింపులు ఎదుర్కొన్నారు. ఓ గుర్తు తెలియని వ్యక్తి ఫోన్‌లో రూ. 50 లక్షలు ఇవ్వాలని, లేకపోతే తీవ్ర పరిణామాలు ఉంటాయని బెదిరించాడు.