- తెలుగు రాష్ట్రాల్లో ఇదే మొదటిసారి
- తీవ్ర గాయాలతో ఉన్న రోగులకు కొత్త ఆశలు
హైదరాబాద్, నవంబర్ 6, 2024: అపోలో హాస్పిటల్స్ ఆధ్వర్యంలో తెలుగు రాష్ట్రాల్లో మొదటిసారి అత్యంత కష్టమైన ‘మైక్రోవాస్కులర్ రీప్లాంటేషన్ శస్త్రచికిత్స’ను విజయవంతంగా పూర్తి చేశారు. ఇంత పెద్ద ప్రాక్సిమల్ లింబ్ రీఅటాచ్‌మెంట్ చేయడం ఇదే తొలిసారి. రోగి 26 రోజులలో కోలుకోనున్నారు. వేళ్లు కదలిక మరింత మెరుగుపరిచేందుకు ఆరు నెలల్లో అదనపు శస్త్రచికిత్సలు చేయనున్నారు. ఈ మైక్రోవాస్కులర్ రీప్లాంటేషన్ శస్త్రచికిత్స ఆధునిక ట్రామా కేర్‌లో అపోలో నాయకత్వానికి నిదర్శనంగా నిలిచింది. ఇది తీవ్ర గాయాలతో ఉన్న రోగులకు ఆశలను చిగురింప చేస్తుందనడంలో ఎటువంటి సందేహం లేదు. ఈ సందర్భంగా హైదరాబాద్‌లోని అపోలో హాస్పిటల్‌లో మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో అపోలో హాస్పిటల్స్ (హైదరాబాద్) కన్సల్టెంట్ హ్యాండ్, రిస్ట్, రీకన్స్ట్రక్సివ్ మైక్రోసర్జన్ డాక్టర్ జీఎన్ బండారి మాట్లాడుతూ ‘మంచిర్యాలకు చెందిన ఏ పవన్ కుమార్ కుడి మోచేయి విరిగి పోయింది. ప్రాక్సిమల్ హ్యూమరస్ లో గ్రేడ్ 3సీ విరిగిన గాయాలతో అపోలో హాస్పిటల్స్ హైదరాబాద్‌లో అక్టోబర్ 11వ తేదీన చేరారు. ఈయన వయస్సు 32. ఇది భుజం మోచేతిని కలుపుతూ ఉన్న భాగం. రీప్లాంటేషన్ కోసం కీలకమైన 4 నుంచి 6 గంటల ‘గోల్డెన్ అవర్’ సమయం దాటింది. అయినా, అపోలో వైద్య బృందం వేగంగా స్పందించింది. రోగిని నేరుగా ఆపరేషన్ థియేటర్ కు తరలించి తక్షణం చికిత్స అందించామని’ తెలిపారు. ఈ శస్త్రచికిత్స మైక్రోవాస్కులర్ రీప్లాంటేషన్‌లో ఒక కీలక ఘట్టం అన్నారు. గోల్డెన్ అవర్ దాటిన తర్వాత కూడా రీప్లాంటేషన్ సాధ్యమని ఈ శస్త్రచికిత్స నిరూపించిందన్నారు. అవయవాలను తక్షణం సంరక్షణ చేయడం, వేగంగా తరలించడం రీప్లాంటేషన్‌కు ఎంత కీలకమో అవగాహన పెంచడమే మా లక్ష్యమన్నారు.
ఈ సందర్భంగా అపోలో హాస్పిటల్స్ తెలంగాణ సీఈవో తేజస్విరావు మాట్లాడుతూ ఈ విజయం అపోలో హాస్పిటల్స్ ఆధునిక వైద్య పరిష్కారాలపై ఉన్న అచంచల నిబద్ధతకు నిదర్శనమన్నారు. ఈ విజయం ట్రామా చికిత్సలో ప్రమాణాలను నిర్వచిస్తుందన్నారు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లోని ప్రజలకు ప్రపంచ స్థాయి వైద్య సాంకేతిక ప్రగతిని అందించడం గర్వంగా ఉందన్నారు.
ఈ సందర్భంగా అపోలో హాస్పిటల్స్ (హైదరాబాద్) మెడికల్ సర్వీసెస్ డైరెక్టర్ డాక్టర్ రవీందర్ బాబు మాట్లాడుతూ ఈ రీప్లాంటేషన్ శస్త్రచికిత్సలో మా విజయానికి మైక్రోవాస్కులర్ విధానాలలో అధునాతన నైపుణ్యాలతో కూడిన అత్యంత ప్రత్యేక బృందాలను రూపొందించడంలో అపోలో అంకితభావం ఫలితమేనన్నారు. ఈ విజయం రోగి కేంద్రీకృత శస్త్రచికిత్సకు నిదర్శనమన్నారు. అత్యంత క్లిష్టమైన కేసులలో కూడా జీవితాన్ని మార్చగల అవకాశాలను అందిస్తుందని తెలిపారు.
డాక్టర్ జీఎన్ బండారి (కన్సల్టెంట్ హ్యాండ్, రిస్ట్, మైక్రోసర్జన్) నేతృత్వంలోని శస్త్రచికిత్స బృందం డాక్టర్ గురు ప్రసాద్ (ప్లాస్టిక్ సర్జన్), డాక్టర్ వివేక్ రెడ్డి (ఆర్థోపెడిక్ సర్జన్), డాక్టర్ శారణ్య (అనస్తీటిస్ట్), డాక్టర్ రాజ్ కుమార్ (క్రిటికల్ కేర్ స్పెషలిస్ట్) సహకారంతో రెండు బృందాలు ఒకేసారి క్లిష్టమైన ఎనిమిది గంటల శస్త్రచికిత్సను విజయవంతంగా నిర్వహించాయి. ఒక బృందం చేతిని సిద్దం చేస్తుండగా, మరో బృందం రీ-అటాచ్‌మెంట్ కోసం పని చేసింది. డాక్టర్ సయ్యద్ నౌమాన్ క్వాద్రీ, డాక్టర్ గణేష్ పెర్కే వంటి జూనియర్ వైద్యులు, నర్సులు దారియా, పాయల్, టెక్నీషియన్ నవీన్, క్రిటికల్ కేర్ బృందం సహకారంతో ఈ శస్త్రచికిత్స నిర్వహించారు.
ఈ కేసు శస్త్రచికిత్సలో భవిష్యత్ ఆశలను కూడా స్పష్టం చేస్తుంది. మృతి చెందిన, జీవించే దాతల నుంచి సేకరించిన దాతల చేతులు అర్హత కలిగిన రోగులకు పునరుద్ధరించడంలోనూ, అంగవైకల్యం నివారించడంలోనూ సహాయపడగలవు. అపోలో హాస్పిటల్స్ హైదరాబాద్ వైద్య ఆవిష్కరణలో అగ్రగామిగా ఉంది. రోగులకు ప్రయోజనం కలిగించేందుకు ట్రామా కేర్, రీప్లాంటేషన్, ప్రత్యామ్నాయ శస్త్రచికిత్సల ఫలితాలను మెరుగుపరచడం, అవకాశాలను విస్తరించేందుకు కృషి చేస్తుంది.
మరింత సమాచారానికి దయచేసి సంప్రదించండి : 9959154371 / 9963980259