తూర్పు-పశ్చిమ గోదావరి ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఉప ఎన్నిక షెడ్యూలు

The Election Commission has announced the schedule for the Teacher MLC by-election in the East-West Godavari districts, with the election code coming into effect from November 4. The Election Commission has announced the schedule for the Teacher MLC by-election in the East-West Godavari districts, with the election code coming into effect from November 4.

తూర్పు గోదావరి పశ్చిమ గోదావరీ జిల్లా ఉపాధ్యాయ శాసన మండలి ఉప ఎన్నికల షెడ్యూలు ను ఎన్నికల కమిషన్ ప్రకటించిన దృష్ట్యా నవంబర్ 4 నుంచి జిల్లాలో ఎన్నికల కోడ్ అమలులోకి వచ్చిందని జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి తెలియ చేశారు. మంగళవారం సాయంత్రం కలెక్టరు క్యాంపు కార్యాలయంలో జిల్లా ఎస్పీ డి నరసింహ కిషోర్, జాయింట్ కలెక్టర్ ఎస్ చిన్న రాముడు, జిల్లా రెవెన్యూ అధికారి టి. శ్రీరామచంద్రమూర్తి లతో కలిసి పాత్రికేయుల సమావేశంలో పాల్గొన్నారు. పూర్వపు ఉభయ గోదావరీ జిల్లా పరిధిలోని టీచర్స్ ఎమ్మెల్సి స్థానానికి ఎన్నికల కమిషన్ షెడ్యూలు విడుదల చెయ్యడం జరిగిందని తెలిపారు. కాకినాడ జిల్లా, ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లా కలెక్టరు ఎన్నికల రిటర్నింగ్ అధికారి గా వ్యవహరిస్తారని, ప్రస్తుత తూర్పు గోదావరి జిల్లా – జిల్లా రెవిన్యూ అధికారి (డి ఆర్వో) సహాయ రిటర్నింగ్ అధికారి గా వ్యవహరిస్తారని తెలిపారు. తూర్పు గోదావరి జిల్లా పరిధిలో 20 పోలింగు కేంద్రాలలో ఉపాద్యాయ ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకు నేందుకు ఏర్పాట్లు చెయ్యడం జరిగిందని కలెక్టర్ పి ప్రశాంతి తెలియ చేశారు. 18 మండలాల్లో ఒక్కొక్కటి చొప్పున, రాజమహేంద్రవరం నగరపాలక సంస్థ పరిధిలో రెండు పోలింగు కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. మొత్తం 2,893 మంది ఓటర్లుగా నమోదు కావడం జరిగిందన్నారు.

తూర్పు పశ్చిమ గోదావరీ జిల్లా ఉపాధ్యాయ నియోజకవర్గం నుండి ఏపి శాసనసభకు ఉప ఎన్నికల నిర్వహణ కోసం భారత ఎన్నికల సంఘం ఈ దిగువ విధంగా షెడ్యూల్‌ను ప్రకటించిందన్నారు. నోటిఫికేషన్ జారీ …11.11.2024 (సోమవారం) నామినేషన్లు వేయడానికి చివరి తేదీ 18.11.2024 (సోమవారం) నామినేషన్ల పరిశీలన .. 19.11.2024 (మంగళవారం) అభ్యర్థుల ఉపసంహరణకు చివరి తేదీ 21.11.2024 (గురువారం) పోలింగ్ తేదీ: 05.12.2024 (గురువారం) ఉదయం 8.00 నుండి సాయంత్రం 4.00 వరకు…. ఓట్ల లెక్కింపు 09.12.2024 (సోమవారం) ఎన్నికల కోడ్ ముగిసే తేదీ ..12.12.2024 (గురువారం).

శాసనమండలి ఉపాధ్యాయ ఎమ్మెల్సి స్థానానికి ఎన్నికల కోడ్ అమలు లో ఉన్నందున వాటికీ సంబంధించిన ఎటువంటి అధికారిక కార్యక్రమాలను నిర్వహించడం జరగదని కలెక్టర్ తెలిపారు. కొత్తగా ఎటువంటి కార్యక్రమాలను చేపట్టడం జరగదని, ప్రస్తుతం జరుగుతున్న పనులని యధావిధిగా కొనసాగించనున్నట్లు తెలియ చేశారు. ప్రజా ప్రాతినిధి చట్టం అనుసరించి ఎన్నికల కమిషన్ మార్గదర్శక అనుసరించి విధులను నిర్వహించడం జరుగుతుందన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *