బీజేపీ నేత మహేశ్వర్ రెడ్డి సీఎం రేవంత్ రెడ్డి పదవికి సంబంధించిన వ్యాఖ్యలు చేయడంతో కాంగ్రెస్ ఎంపీ మల్లు రవి మండిపడ్డారు. సీఎం పదవి మారుతుందనే వ్యాఖ్యలు మహేశ్వర్ రెడ్డి రాజకీయ అవగాహనలేకపోవడమేనని అన్నారు. రేవంత్ రెడ్డి ఈసారి మాత్రమే కాదు, మరో పదేళ్లపాటు సీఎం పదవిలో కొనసాగుతారని ధైర్యంగా పేర్కొన్నారు. బీజేపీ నాయకులు చేయడానికి ఏ పనీ లేక పోవడంతో ఇలాంటివి మాట్లాడుతున్నారని విమర్శించారు.బీజేపీలో విభేదాలు అధికమవుతున్నాయని, వాటిని దృష్టిలో ఉంచుకుని ప్రజల దృష్టి మరల్చేందుకు సీఎం మారతారంటూ అబద్ధాలు ప్రచారం చేస్తున్నారని ఎద్దేవా చేశారు.
సీఎం పదవిపై బీజేపీ వ్యాఖ్యలపై మల్లురవి స్పందన
