‘లూసిఫర్’ 2019లో విడుదలై బ్లాక్ బస్టర్ విజయం సాధించింది. ఇప్పుడు ఈ చిత్రానికి సీక్వెల్‌గా ‘L2 ఎంపురాన్’ రూపొంది రాబోతోంది. మలయాళ సూపర్ స్టార్ మోహన్‌లాల్ ఈ చిత్రంలో ప్రధాన పాత్రలో నటిస్తున్నాడు. లైకా ప్రొడక్షన్స్ నిర్మిస్తున్న ఈ చిత్రం, తొలి భాగం విజయవంతమైన తరువాత మరింత అంచనాలతో ప్రేక్షకులను అలరించేందుకు ప్రత్యేకంగా రూపొందించబడింది.
మోహన్‌లాల్ పుట్టినరోజు సందర్భంగా, ‘L2 ఎంపురాన్’ లో ఖురేషి అబ్రమ్‌గా అతని లుక్‌ను విడుదల చేశారు. ఈ ఫస్ట్ లుక్‌ను చూసిన అభిమానుల నుండి అమేజింగ్ రెస్పాన్స్ వస్తోంది. అలాగే, పృథ్వీరాజ్ సుకుమార్ పోషిస్తున్న క్యారెక్టర్ జయేద్ మసూద్‌కు సంబంధించిన లుక్‌ను కూడా విడుదల చేశారు. ఈ చిత్రంలో టోవినో థామస్, మంజు వారియర్, నందు, సానియా అయ్యప్పన్ వంటి నటులు మళ్ళీ తమ పాత్రలతో ప్రేక్షకులను మెప్పించడానికి సిద్ధమయ్యారు.
‘L2 ఎంపురాన్’ విడుదల తేదీని ప్రకటిస్తూ, మేకర్స్ పోస్టర్‌ను విడుదల చేశారు. మంటల మధ్య వైట్ షర్ట్ ధరించిన మోహన్‌లాల్ లుక్‌ను బ్యాక్ సైడ్ నుంచి ఎలివేట్ చేస్తూ రూపొందించిన ఈ పోస్టర్, సినిమాలో మాస్ ఎంటర్‌టైనర్‌గా రూపొందినట్లుగా అంచనాలు పెంచుతోంది. ఈ చిత్రం వచ్చే ఏడాది మార్చి 27న తెలుగు, మలయాళం, తమిళం, కన్నడ, హిందీ భాషల్లో విడుదల కానుంది.