అదిలాబాద్ జిల్లా తలమడుగు మండలంలోని చర్లపల్లి గ్రామంలో దండారి ఉత్సవాల్లో బోథ్ ఎమ్మెల్యే అనిల్ జాధవ్ ముఖ్యఅతిథిగా హాజరయ్యారు గుస్సాడీలు గ్రామస్తులు దండారి నృత్యాలతో ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా గ్రామంలో రూ. 15 వేల విలువ గల 31 దండారి చెక్కులను బోథ్ ఎమ్మెల్యే అనిల్ జాధవ్ పంపిణీ చేశారు. అనంతరం వారు మాట్లాడుతూ గత ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదివాసులను వారి సాంప్రదాయాన్ని గౌరవించి వారి దండారి పండుగగు రూ. 10 వేలు అందించాలని నిర్ణయం తీసుకున్నారని అన్నారు. అదేవిధంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి 15 వేలకు చేసి దండారి పండుగను అందరూ అలయి బలాయిగా జరుపుకుంటామని అన్నారు. ఈరోజు దీపావళి సందర్భంగా అందరికి శుభాకాంక్షలు తెలిపారు. కార్యక్రమంలో డీసీసీబీ చైర్మన్ అడ్డి బోజారెడ్డి పాటు మండల నాయకులు పాల్గొన్నారు.
దండారి ఉత్సవాల్లో బోథ్ ఎమ్మెల్యే అనిల్ జాధవ్
