వెంకటాయపాలెం గ్రామంలో దీపావళి పండుగ సందర్భంగా కోర్ల రామయ్య కుటుంబంలో దారుణ ఘటన చోటుచేసుకుంది. రామయ్యకు ముగ్గురు పిల్లలు ఉండగా, పెద్ద కుమారుడు ప్రశాంత్ వివాహం చేసుకున్నాడు. చిన్న కుమారుడు ప్రదీప్ (27) పెళ్లి కాలేదు. పండుగ కోసం వచ్చిన చెల్లె ప్రియాంకతో వదిన ఇందుకు స్వల్ప గొడవ చోటుచేసుకుంది. ఈ విషయమై బయటకు వెళ్లి తిరిగి ఇంటికి వచ్చిన ప్రదీప్ తన వదినతో గొడవకు కారణమని నిలదీయగా ఇద్దరి మధ్య మాటల తూటాలు పేలాయి.
మాటలు పెరిగి వాగ్వాదం తీవ్రం కావడంతో ఆగ్రహించిన వదిన కత్తితో మరిది ప్రదీప్ గుండెలో పొడిచింది. రక్త స్రావంలో ప్రదీప్ అపస్మారక స్థితిలో పడిపోగా కుటుంబ సభ్యులు మరియు చుట్టుపక్కల వారు హుటాహుటిన హాస్పిటల్ కి తరలించారు. మార్గమధ్యంలో ప్రదీప్ ప్రాణాలు విడిచాడు. ఈ దారుణ ఘటన స్థానిక ప్రజలను తీవ్ర విషాదంలోకి నెట్టేసింది. విషయం తెలుసుకున్న రూరల్ సీఐ ఎం.రాజు సంఘటన స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసి, దర్యాప్తు ప్రారంభించారు.